హృతిక్‌తో డేటింగ్‌కు పంపలేదని… కోకాకోలాపై పరువునష్టం దావా!

పదిహేనేళ్ల నాటి పబ్లిసిటీ వ్యవహారం ఇప్పుడు కోర్టు వరకూ వెళ్లింది. ఎలాగంటే… కండలు తిరిగిన హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా అమ్మాయిలతో మహా పిచ్చి. అతడంటే పడిచచ్చే వారు చాలా మందే ఉన్నారు. ఇక, ఆ సినిమా విడుదలైనప్పుడు చూడాలి, అతగాడి క్రేజ్. ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు. అప్పట్లో ఆ సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు పోటీ పడ్డాయి.

కోకాకోలో కంపెనీ కూడా ఓ పోటీ పెట్టింది. అందులో గెలిచిన వారు హృతిక్ తో డేటింగ్ కు పంపిస్తామని ప్రకటించింది. దీంతో వేల మంది పోటీ పడ్డారు. హర్యానా పంచ్ కుల పట్టణానికి చెందిన శిఖా మోగే అప్పట్లో కాలేజీ విద్యార్థిని ఆమె కూడా ఆ పోటీలో పాల్గొంది. లక్కీగా విజేత అయింది. ఇది తెలిసి ఎగిరి గంతేసింది. డ్రీమ్ బాయ్ తో డేటింగ్ కు వెళ్తానని కాలేజీలో అందరికీ చెప్పుకొంది. ఆ రోజు కోసం ఎదురు చూసింది. కానీ కోకాకోలా వారు మాట నిలబెట్టుకోలేదు. కనీసం హృతిక్ ను కలవడానికి కూడా అనుమతించలేదు. దానికి బదులు ఓ 5 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.

కాలం గడిచింది. ఇప్పుడు ఆమెకు 34 ఏళ్లు. ఆనాడు తనకు పరువు నష్టం కలిగిందంటూ శిఖా కోర్టుకు వెళ్లింది. పోటీలో గెలిచి డేటింగ్ కు వెళ్తున్నానని అందరికీ చెప్పుకున్నా, కానీ అలా జగకపోవడంతో పరువు పోయిందని వాదిస్తోంది. పరువుకు నష్టం కలిగించినందుకు కోకాకోలా కంపెనీ నుంచి తనకు 2.5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలంటూ దావా వేసింది. హర్యానాలో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. విచారణ పూర్తయిన తర్వాత తీర్పు ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి ఇష్యూ : హరీష్ రావుకు కేసీఆర్ కీలక ఆదేశాలు?

రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలను అట్టుడికేలా చేసిన కౌశిక్ రెడ్డి - అరికెపూడి గాంధీ వివాదంలో బీఆర్ఎస్ ఇక వెనక్కి తగ్గినట్టేనా? ఈ విషయంలో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిందని కేసీఆర్...

చైతన్య : పంజరంలో సీబీఐని న్యాయవ్యవస్థ విడిపించగలదా ?

పంజరంలో చిలుకలా వ్యవహరించవద్దని సీబీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు....

రేవంత్‌ను తక్కువ అంచనా వేస్తే ఇంతే !

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలవడానికి తంటాలు పడింది. ...

వైసీపీ ట్రబుల్ షూటర్ విడదల రజనీ

ప్రతి పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ ఉంటారు. పార్టీలో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఆ ట్రబుల్ షూటర్ చేసే ప్రయత్నాలు పార్టీని చాలా వరకూ గాడిలో పెడతాయి. వైసీపీలో ఇప్పుడా ట్రబుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close