ప్రముఖ హాస్య నటుడు స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ అర్ధాంగి కళాప్రపూర్ణ (63) సోమవారం తెల్లవారు జామున మరణించారు. జనవరి 23న స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ ప్రధమ వర్ధంతిని జూబ్లీ హిల్స్ లో గల ఆమె నివాసంలో నిర్వహించారు. ఆ కార్యక్రమం నిర్వహించిన రెండో రోజే ఆమె మరణించడం అందరినీ కంట తడిపెట్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎమ్మెస్ నారాయణ తనకంటూ ఒక ప్రత్యక గుర్తింపు సంపాదించుకొని తనదైన శైలిలో చెరగని ముద్ర వేసినప్పటికీ, ఆయన మరణించిన తరువాత సినీ పరిశ్రమలో వారెవరూ ఆయనను మళ్ళీ తలచుకొన్న దాఖలాలు లేవు. కానీ ఆయన అర్ధాంగి మాత్రం ఆయన జ్ఞాపకాలలోనే కనుమూశారు.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              