ఇదిగో కేసీఆర్ రంగంలోకి వచ్చేస్తున్నారు ఇక పరుగులు పెట్టాల్సిందే అని ఇచ్చిన ఎలివేషన్లు వృధా పోయాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చర్చల్లో పాల్గొంటారని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి్ మాత్రం వస్తారని హరీష్ రావు చెప్పారు. ఆయన మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా .. కేసీఆర్ చర్చల్లో పాల్గొంటారని హడావుడి చేసింది. దడదడలాడిస్తారని చెప్పుకున్నారు. ప్రెస్మీట్లో చెప్పినట్లుగా తోలుస్తారని ప్రచారం చేశారు.
ఈ ఎలివేషన్లు బాగా ఎక్కువగా జరిగాయి. దీంతో చాలా మందికి నమ్మకం లేకపోయినా కేసీఆర్ నిజంగానే సీరియస్గా అసెంబ్లీలో రేవంత్ ను ఎదుర్కోబోతున్నారా అని చర్చించుకున్నారు. కానీ కేసీఆర్ ఐదు నిమిషాల కోసం వచ్చారు. సంతకం పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ ఆయన అసెంబ్లీకి వస్తారని చెప్పడం లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడయా కూడా ఇలా వెళ్లిపోవడంతో ఒక్క సారిగా షాక్ కు గురైంది. అంచనాలు పెంచడానికి సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ కూడా తన వంతు ప్రయత్నం చేశారు. బ్యాక్ ఫైర్ అవుతుందని.. ట్రోలింగ్ కు గురవుతారమని ఆయనకు తెలుసు. అయినా అలాగే ప్రచారం నడిపించారు.
ఇప్పుడు తోలు వలిచే కత్తులు మర్చిపోయి వచ్చారని కొందరు.. భయపడి పారిపోయారని మరికొందరు ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ నేతలు కంగారు పడాల్సి వస్తోంది. అనవసరంగా ఎలివేషన్లు ఇవ్వడం ఇప్పుడు కవరింగ్ కు ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.