ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్ ద్వారా సేకరించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లుగా సిట్ గుర్తించింది. జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన గోవిందప్పతోపాటు మరో కీలక వ్యక్తి ద్వారా ఈ ముడుపులు బెంగళూరులోని రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లాయని సమాచారం.
లిక్కర్ స్కామ్ ద్వారా ఎక్కడి నుంచి ఎంత వస్తోంది? వాటిని ఏయే మార్గాల ద్వారా రూటింగ్ చేసి రియల్ వ్యాపారంలోకి మళ్లించాలనే విషయాలపై సమావేశాలు కూడా నిర్వహించారని గుర్తించిన సిట్, ఈ సమావేశాల్లో గోవిందప్పతోపాటు జగన్ కుటుంబానికి సన్నిహితుడైన మరో కీలక వ్యక్తి కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేయడంతో ,ఆ కీలక వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పడింది సిట్. ఆయనకు ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి? ఎవరి ఆదేశాల మేరకు సమావేశాలు నిర్వహించారు? అనే విషయాలను సిట్ దర్యాప్తులో తేల్చనుంది.
మరోవైపు.. లిక్కర్ స్కామ్ లో వచ్చిన వెయ్యి కోట్ల ముడుపులను రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించగా.. బెంగళూరులో వాటి విలువ ప్రస్తుతం మూడు వేల కోట్లకు చేరుకుందని అంచనా. ఇదంతా అసలు వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయకుండా బినామీల పేర్ల ఈ తతంగం కొనసాగించారని తెలుస్తోంది.
ఆ కీలక వ్యక్తి ఎవరు అన్నది బయటపడితే..కేసు బిగ్ బాస్ వైపు వెళ్లేందుకు మరెంత సమయం పట్టకపోవచ్చు. ఈ కేసులో వేగం చూస్తుంటే త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.