118 సమీక్ష : నెంబర్ కొత్తది..విషయం పాతదే

తెలుగు360 రేటింగ్ 2.75/5

తెలిస్తే కొత్త పాయింట్ చెప్పు. లేదూ అంటే కొత్తగా చెప్పు అన్నది టాలీవుడ్ లో సాధారణంగా అందరూ పాటించే సూత్రం. ఎక్కువ మంది ఈ రెండో అంశాన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. ఎందుకంటే కొత్త పాయింట్ కోసం ఆలోచించడం కన్నా, కొత్తగా చెప్పడానికి ఆలోచిస్తే బెటర్ అనేది వాళ్ల ఆలోచన కావచ్చు.

హీరోయిన్ ఏదో ఓ స్కామ్ ను అనుకోకుండా చూడడం, దాంతో వాళ్లు ఆ హీరోయిన్ ను చంపేయడం అన్న పాయింట్ తెలుగు సినిమాలో సినిమా అనే పదం అంత పాతది. పవన్ కళ్యాణ్, నాగార్జున దగ్గర నుంచి దాదాపు చాలా మంది హీరోల సినిమాల్లో చూసిందే. అయితే ఆయా సినిమాల్లో అది మెయిన్ ప్లాట్ గా వుండదు. సబ్ ప్లాట్ గా వచ్చి, కథలో మిక్స్ అవుతుంది.

కానీ దాన్నే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, మనిషి చచ్చిపోయినా, మనిషిని చంపేసినా, ఆ వ్యక్తిలోని ఆలోచన చావదు అనే కొత్త కాన్సెప్ట్ జోడించి ప్రెజెంట్ చేసిన ప్రయత్నమే 118. కళ్యాణ్ రామ్-షాలినీ పాండే, నివేథా థామస్ లాంటి స్టార్ కాస్ట్, గుహన్ లాంటి సినిమాటోగ్రాఫర్ తొలిసారి డైరక్టర్ గా మారడం వంటి అంశాలు 118 కు పాజిటివ్ బజ్ తీసుకువచ్చాయి.

ఇంతకీ ఏమిటీ 118?

పారడైజ్ రిసార్ట్ లోని 118 రూమ్ లో వుండి, నిద్రపోతున్న సమయంలో ఓ కల వస్తుంది ఇన్ వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గౌతమ్ (కళ్యాణ్ రామ్)కు. ఆ కలలో ఒక అమ్మాయి (నివేధా థామస్) ను ఎవరో ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొడుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే కల రెండుసార్లు వస్తుంది గౌతమ్ కి. ముందు మరచిపోదాం అనుకున్నా, కలలో కనిపించిన వన్నీ బయట కూడా కనిపిస్తుంటాయి. దాంతో ఆ అమ్మాయి కూడా ఎక్కడో అక్కడ వుండాలి కదా అన్న క్యూరియాసిటీ. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పరిశోధన. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి ఏమయింది? అన్నది మిగిలిన సినిమా.

ముందే చెప్పుకున్నట్లు కథలో పాయింట్ కానీ, ప్లాట్ కానీ కొత్తది కాదు. అయితే కలలో కనిపించడం, అందులోని గుర్తులు ఆధారం చేసుకుని పరిశోధన సాగించడం అన్నది కాస్త కొత్త పాయింట్. అలాగే మనిషి చనిపోయినా, ఆలోచనలు బతికే వుంటాయి, వాటి కారణంగానే విషయం బయటకు వస్తుంది అన్నది కొత్త పాయింట్. నిజానికి అసలు కథకు ఇదే మూలమైన పాయింట్ కూడా. కానీ దర్శకుడు ఆ పాయింట్ ను ఎందుకో బలంగా నొక్కి చెప్పకుండా, ఆ పాయింట్ మొదటి నుంచీ హైలైట్ చేయకుండా కేవలం కల చుట్టూనే కథను తిప్పుకుంటూ వచ్చాడు. కానీ కలతో పాటు ఈ పాయింట్ ను కూడా ఏదో విధంగా రిమైండ్ చేస్తూ వస్తే బాగుండేది.

118 సినిమా కాస్త రొటీన్ కానే టేకాఫ్ తీసుకుంటుంది. అయితే విజువల్స్ గ్రాండ్ గా వుండడం కోసం అన్నట్లుగా, మినీ హిమాలియన్ కార్ ర్యాలీ లాంటి సీన్ ఒకటి జోడించారు. అక్కడ నుంచి కల వచ్చే వరకు సినిమా మామూలే. అయితే హీరో సైకాలజీ, స్టామినా చెప్పడం కోసం ఆ స్టార్టింగ్ సీన్లు వాడుకున్నారు.

ఒకసారి కల అన్నది స్టార్ట్ అయ్యాక సినిమా రేస్ మాదిరగా దూసుకుపోయింది. తొలి సగం మొత్తం ఎక్కడా అంచనాలకు అందకుండా, బోర్ కొట్టకుండా, అనవసరపు సీన్ అన్నది ఒక్కటీ లేకుండా చాలా క్రిస్ప్ గా వెళ్లింది. దాంతో సినిమా బానే వుంది అన్న ఆలోచనతో రెండో సగంలోకి అడుగుపెడతాడు ప్రేక్షకుడు.

అప్పుడు కూడా సినిమా సస్పెన్స్ ముడి వీడిపోకుండా జాగ్రత్తగానే నడిపాడు దర్శకుడు గుహన్. కానీ ఎప్పుడయితే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు ప్రారంభం కావడం, ఆ ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ ను కొత్తగా కలలు, వాటి వ్యవహారాలు అనే సైంటిఫిక్ అప్రోచ్ తో వెళ్లాలని ప్రయత్నించారో? అక్కడ కాస్త గాడితన్నింది. సాధారణంగా ముందు చెప్పుకున్నాట్లు, ఇలాంటి విషయం సబ్ ప్లాట్ గా వచ్చిన సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చకచకా సాగిపోయి, అయిదు పది నిమషాల్లో ముగిసిపోతుంది. కానీ ఇక్కడ అదే మెయిన్ ప్లాట్ కావడంతో, ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి కాస్త ఎక్కువ టైమ్, కొత్త పద్దతి తీసుకున్నారు. కానీ అదే కాస్త సమస్యగా మారింది.

అంత వరకు రేసీ స్క్రీన్ ప్లే టెక్నిక్ తో సాగిన సినిమా అక్కడ నుంచి సాగినట్లు లేదా సాగదీసినట్లు పీలింగ్ ఇస్తుంది. సినిమాకు ఇదే సమస్య. బయటకు వచ్చిన ప్రేక్షకుడిని ఎలా వుందీ అని అడిగితే ఫస్ట్ హాఫ్ బాగుంది అని చెప్పడానికి కారణం, సెకండాఫ్ లోని ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నే. ఈ ఒక్క మైనస్ ను పక్కన పెడితే, టోటల్ గా సినిమా ఆ జోనర్ కు అంటుకుని, పక్క చూపులు చూడకుండా, బాగానే తీసారనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కలల ద్వారా చెప్పడం కాకుండా, మరేదైనా ప్రయత్నం చేయాల్సింది. అదే విధంగా రోటీన్ మెడికల్ స్కామ్ కాకుండా మరికాస్త కొత్తగా ఆలోచించాల్సింది. అప్పుడు సినిమా అస్సలు వంక పెట్టడానికి చాన్స్ లేకుండా వుండేది.

తొలి ప్రయత్నమైనా దర్శకుడు గుహన్ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకుండా, తీసిన ప్రతి సీన్ సినిమాకు పనికి వచ్చేలా స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు. ప్రతి సీన్ పరిశోధనకు లీడ్ ఇచ్చేలా రాసుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో సినిమాకు మాంచి లుక్ వచ్చింది. సంభాషణలు మాత్రం ఇంకా మరికాస్త పదునుగా, కొత్తగా వుండేలా రాసుకుని వుంటే బాగుండేది. సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం ప్లస్ అయింది.

కళ్యాణ్ రామ్ బాగా చేసాడు. నివేధా ధామస్ చేయడానికి మరీ ఎక్కువ ఏమీ లేదు అక్కడ. సినిమా విడుదలకు ముందు చెప్పినంత నివేధ పాత్ర ఏమీలేదు. షాలిని ఒకె. బొద్దుతనం తగ్గితే కమర్షియల్ సినిమాలకు కూడా పనికి వస్తుంది అని చెప్పడానికి ఉపయోగపడతుంది ఈ సినిమా. ప్రభాస్ శ్రీను పాత్రకు సంభాషణలే మైనస్.

టోటల్ గా థ్రిల్లర్ లు, పరిశోధన సినిమాలు చూడాలనుకునేవారిని డిస్సపాయింట్ చేయని సినిమా. కమర్షియల్ గా అన్నీ ఫ్యాకేజ్ గా వున్న సినిమా కావాలనుకుంటే మాత్రం సరిపోదు.

ఫైనల్ టచ్…’డ్రీమ్ రివెంజ్’

తెలుగు360 రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close