నలుగురితో (సిపిఐ) నారాయణ…నేడు హెచ్.సి.యు.కి

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీద తెదేపా, బీజేపీ నేతలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు ఈగల్లాగా వాలుతున్నారు. రోహిత్ మరణం కంటే అతను దళిత విద్యార్ధి కావడమే వారిని ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లుంది. యూనివర్సిటీకి వెళ్లి దళిత విద్యార్ధి సంఘాలకు సంఘీభావం తెలిపి, అక్కడి నుండి రోహిత్ తల్లి వద్దకు వెళ్లి సానుభూతి తెలిపి వస్తే చాలు దేశంలో దళితులందరూ తమ పార్టీల వైపు ఆకర్షితులవుతారనే అత్యాశే వారినందరినీ అక్కడికి రప్పిస్తున్నట్లుంది.

ఇవన్నీ నేటి రాజకీయాలలో ఒక ఆనవాయితీగా మారిపోయాయి. కనుక అక్కడికి వెళ్ళివస్తున్నవారు, సంఘటనా స్థలం నుండే ఇంకా అక్కడికి రాని వారిని విమర్శించడం, తద్వారా తమ ‘హాజరీ’ గురించి చాటుకోవడం, ప్రత్యర్ధి పార్టీని వేలెత్తి చూపించడం కూడా ఈ ఆనవాయితీలో ఒక భాగం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఇదే ఆనవాయితీని పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించేరు. అక్కడికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు కూడా తూచా తప్పకుండా ఈ ఆనవాయితీని పాటించారు. ఇంకా చాలా మంది పాటించారు. పాటిస్తూనే ఉన్నారు.

ఈ సంఘీభావం, పరామర్శ పోటీలో తాము మాత్రం ఎందుకు వెనుకబడిపోవడం అన్నట్లు సిపిఐ ఏపి రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా నేడు హెచ్.సి.యు.కి వస్తున్నారు. వారిరువురు కూడా ఈ సంఘీభావం, పరామర్శ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడిని, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శించి వెళ్ళిపోతారు. ఆ తరువాత క్యూలో నిలబడి ఉన్న మరో రాజకీయ నాయకుడు ఎవరో వచ్చిపోవచ్చును.

రాజకీయనాయకుల రాక వలన ప్రభుత్వంపై ఒత్తిడి పెరగవచ్చును. రోహిత్ కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం లభించవచ్చును. ఈ సంఘటనకు కారకులయినవారి ఉద్యోగాలు ఊడవచ్చును. కానీ యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులలో మాత్రం ఎటువంటి మార్పు ఉండకపోవచ్చును. ఈ హడావుడి అంతా సద్దుమణిగే వరకు యూనివర్సిటీలో తాత్కాలికంగా ప్రశాంతత నెలకొనవచ్చును. కానీ ఆ తరువాత మళ్ళీ మామూలే.

ఈ ఆనవాయితీ వలన విద్యార్ధులను రాజకీయాలకు మరింత చేరువవడం, తత్ఫలితంగా వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రస్తుతం యూనివర్సిటీకి రాజకీయ నేతల తాకిడి కారణంగా అక్కడ (రాజకీయ) వాతావరణం ఇంకా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే విద్యార్ధులు రాజకీయ పార్టీలకి అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసుకొని వేర్వేరు గ్రూపులు విడిపోయారు. ఇప్పుడు రాజకీయ నేతలు వచ్చి యూనివర్సిటీలోని తమ పార్టీల అనుబంధ విద్యార్ధి సంఘాలకి భరోసా కల్పించి, వారిని రెచ్చగొట్టి వెళ్ళిపోతే తరువాత ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును.

డిల్లీలో వాహన కాలుష్యం తగ్గించడానికి సరి-బేసి విధానం అమలు చేసినట్లుగానే, యూనివర్సిటీలలో ఈ రాజకీయ కాలుష్యాన్ని నియంత్రించదానికి అటువంటి విధానం ఏదో ఒకటి అమలుచేయాలి లేకుంటే రాజకీయ నాయకులు అందరూ ఈవిధంగా యూనివర్సిటీలలోకి ప్రవేశిస్తూ ఆ కాలుష్యం ఇంకా పెంచుతున్నట్లయితే దానికి అంతిమంగా విద్యార్ధులే బలవుతారు తప్ప రాజకీయ నాయకులు, పార్టీలు కావు.

విద్యార్ధులు కూడా రాజకీయనాయకులు యూనివర్సిటీలలోకి రావడాన్ని గొప్ప విషయంగా భావించడానికి బదులు వారి రాక వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటనే సంగతి గ్రహించడం చాలా అవసరం. సానుభూతి, సంఘీభావం తెలపడానికి వస్తున్నవారు అంతటితో ఆగకుండా ఆ తరువాత ఈ విషాద సంఘటనని ఏవిధంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటున్నారో గ్రహించితే వారికే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close