హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, ప్రీమియం ప్రాజెక్టులు , బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్లను కొనుగోలుదారుల ఎదుటకు తీసుకు వచ్చేందుకు 15వ NAREDCO తెలంగాణ ప్రాపర్టీ షో HITEX ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. అక్టోబర్ 10 నుంచి 12 వరకు మూడు రోజులు జరిగే ఈ ఈవెంట్లో రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నారు. ఇది హోమ్ బైయర్లు, ఇన్వెస్టర్లకు ఒకే చోటున అన్ని అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది.
అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఆఫీస్ స్పేస్‌లు, రిటైల్ కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు కన్స్ట్రక్షన్ టెక్నాలజీలు, హోమ్ ఫైనాన్స్ ఆప్షన్లు కూడా ప్రాపర్టీ షోలో అందుబాటులో ఉన్నాయి. ఈ షోలో 100+ ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. లైవ్ సెమినార్లు, ప్యానెల్ డిస్కషన్లు, ఎక్స్పర్ట్ సెషన్లు రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, ఫైనాన్సింగ్, లీగల్ అంశాలపై ఉంటాయి. స్పెషల్ డిస్కౌంట్లు, బుకింగ్ ఆఫర్లు ప్రాపర్టీ షో సమయంలో మాత్రమే ఇస్తారు.
హైదరాబాద్ భారతదేశంలోని ఫాస్టెస్ట్-గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫ్రా రిఫార్మ్స్, పాలసీలతో మల్టీనేషనల్ కంపెనీలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆకర్షిస్తోంది. 2025లో IT, ITeS, ఫార్మా, EV సెక్టర్లు డిమాండ్‌ను 20% పెంచాయి. ఈ షో హోమ్ బైయర్లకు, ప్రొఫెషనల్స్‌కు నెట్వర్కింగ్ అవకాశాలు అందిస్తుంది . ఇల్లు కొనాలని ఆలోచనలు ఉన్నవారికి.. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు ఈ ప్రాపర్టీషోను చూస్తే.. ఓ అంచనా వస్తుంది.