రాజుగారి గ‌ది 3: ఈసారి రెండు దెయ్యాలు

ఓ బంగ్లా..
దాన్ని అంటిపెట్టుకున్న ఓ ఆత్మ‌..
అందులో ప్ర‌వేశించే ఓ కామెడీ గ్యాంగ్‌

దెయ్యాల సినిమాల ఫార్మెట్ ఇదే. రాజుగారి గ‌ది కూడా ఇలానే తీశాడు ఓంకార్‌. ఆ సినిమా హిట్ట‌య్యింది. రాజుగారి గ‌ది 2కి ప్లేసూ, ఫార్మెట్టూ మార్చాడు. అదీ హిట్ట‌య్యింది. ఈసారి రాజుగారి గ‌ది 3 వ‌చ్చింది, రాజుగారి గ‌ది 1లానే.. 3లోనూ బంగ్లా, ఆత్మ‌, కామెడీ గ్యాంగ్ ఫార్ములాని న‌మ్ముకున్నాడు. అయితే ఈసారి విల‌న్లు కూడా బ‌లంగానే క‌నిపిస్తున్నారు. దానికి తోడు ఒక దెయ్యం కాదు, రెండు ద‌య్యాలున్నాయి. అవికాగోర్ ఈ సినిమా కోసం దెయ్యం అవ‌తారం ఎత్తింది. అవికాని ఈ ఆకారంలో ఎవ్వ‌రూ గుర్తుప‌ట్ట‌లేరేమో..? అవికాకి తోడుగా అశ్విన్ కూడా దెయ్యంలా మారిపోయాడు.

ఇదే య‌క్షిణి పాతేసిన చోటు – అనే డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌లైంది. ఓ భ‌యంక‌ర‌మైన బంగ్లా, చీక‌టి, అందులో చిన్న పిల్ల న‌వ్వులు.. ఇలా హార‌ర్ సినిమాల్లో రొటీన్‌గా చూసే లొకేష‌న్లు, ప్రాప‌ర్టీలే క‌నిపించాయి. ఆర్‌.ఆర్‌తోనూ, అరుపుల‌తోనూ భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు ఓంకార్‌. రాజుగారి 1, రాజుగారి 2ల‌లో క‌నిపించిన కామెడీ గ్యాంగ్‌తో పాటు అలీ కూడా తోడుగా వ‌చ్చాడు. కాస్త హాస్యం, కాస్త భ‌యం… ఇలా రెండింటినీ మిక్స్ చేశాడు. అశ్విన్ న‌ట‌న చూస్తే.. కాంచ‌న‌లో లారెన్స్ గుర్తొస్తాడు. మొత్తానికి హార‌ర్ సినిమాల్లోని సేఫ్ ఫార్మెట్‌ని ఫాలో అయిపోయాడు ఓంకార్‌. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తోంది. సినిమా మొద‌లైన కొద్ది రోజుల్లోనే టీజ‌ర్‌ని విడుద‌ల చేసి త‌న వేగాన్ని చూపించుకున్నాడు ఓంకార్‌. ద‌స‌రాకి ఈసినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.