2017-TAGC Family Fun Bowling tournament

​చికాగో- ఆదివారం ఫిబ్రవరి 26 , 2017 : చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC) ఆద్వర్యములొ ప్రతి ఏటా నిర్వహించే ఆటవిడుపు కార్యక్రమాలలో భాగముగా కుటుంభ సమేతముగా నిర్వహించే బౌలింగ్ (Bowling) టోర్నమెంట్ ఇక్కడి స్థానిక ROSELLEలోని STRIKE TEN BOWLING LOUNGEలో నిర్వహించబడింది. ఈ సంవత్సరం నిర్వహించిన బౌలింగ్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో మొత్తం 173 క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్ సందర్బంగా బౌలింగ్ ప్రాంగణం పాల్గొనడానికి వచ్చిన వారితో కిక్కిరిసి పోయింది. వచ్చిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో పోటీలో పాల్గొన్నారు.ఈ పోటీలలో 5 ఏళ్ళ చిన్నారుల నుండి మొదలుకొని అన్ని వయసుల వారు పాల్గొని ఘన విజయము చేసారు.

అమెరికాలో నివసిస్తున్న ప్రజలు తమ యాంత్రిక జీవనం నుండి బయట పడేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగ పడతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కొద్దీ సేపు సేద తీరడం కొరకు ఈ పోటీలను TAGC సంస్థ వారు గత 40 సంవత్సరములుగా నిర్వహిస్తున్నారు . జీవితంలో క్రీడల ఆవశ్యకతను తెలియజేయడమే ధ్యేయంగా ట్ఏజిసి వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. క్రీడల్లో పాల్గొనడం వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆత్మ స్థైర్యం, క్రీడాస్ఫూర్తి లాంటి మంచి లక్షణాలు అలవాడుతాయి. TAGC సభ్యులు ఇచ్చే స్ఫూర్తితో ట్ఏజిసి పలు పోటీలను తమ సభ్యులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తుంది .

పోటీలో పురుషులు, మహిళలు, బాలలు మరియు బాలికల విభాగాలలో మొదటి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. గెలుపొందిన వారి వివరాలు:

Special Consolation prize winner for wife and husband:
శ్రీమతి & శ్రీ పావని సంతోష్

Men Category :
సాయిరవి సూరిభోట్ల – Winner
వేణుగోపాల్ ఎలిశెట్టి – Runner
సతీష్ నిడదవోలు – 3rd Prize

Women Category :
మానస లట్టుపల్లి – Winner
శిరీష ఏడే – Runner
లక్ష్మి కోరిపల్లి – 3rd Prize

Boys Category :
మోనిష్ మెతుకుమల్లి – Winner
అన్జాన్ ఆనందుల – Runner
అభయ్ గూడూరు – 3rd Prize

Girls Category :
ఆశిక కోరిపల్లి – Winner
రివ లక్కడీ – Runner
అన్షు గొంది – 3rd Prize

పోటీల అనంతరం యువత అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న యూత్ కమిటీ ప్రత్యేక నెట్వర్కింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యువత ఎంతో ఉత్సాహంతో పాలుపంచుకుంది. ఈ సందర్బంగా ఐటీ రంగ నిపుణులు మిస్టర్ ఇవాన్ స్క్రోన్స్ (MR Evan Scronce) అతిధిగా విచ్చేసి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత కాలములో డిజిటల్ రంగం లో ఉద్యోగ అవకాశాలపై సమాచారాన్ని అందించారు. తదనంతరం అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే మరియు యూత్ కమిటీ చైర్ సాయి గొంగాటి ఇవాన్ స్క్రోన్స్ గారిని సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేసిన క్రీడాకారులకు మరియు నిర్వహించడంలో తోడ్పడిన వాలంటీర్స్ కు , ఈ పోటీని ఇంత ఘనముగా నిర్వహించడానికి Sponsor చేసిన PEGASUS KNOWLEDGE SOLUTIONS యజమాని శ్రీని ఓరుగంటి గారికి మరియు STRIKE 10 యజమాని దితు భగవాన్కర్ గార్లకు ట్ఏజిసి అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే కృతజ్ఞతలు తెలియజేసారు. స్పోర్ట్స్ కమిటీ చైర్ సప్తగిరి సంగేమ్ ను మరియు కమిటీ సభ్యులను అభినందించారు. ఇదే సందర్బంగా సభ్యత్వ కమిటీ చైర్ మమతా లంకల, కోశాధికారి వెంకట్ గునుగంటి మరియు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

Click here for TAGC 2017 Fun Bowling Images

Update on upcoming events:

TAGC International Women’s day celebration on Mar 12th,2017
TAGC Ugadhi & Sree Rama Navami Event – April 22nd, 2017

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close