హ్యాట్రిక్ విజ‌యాల‌తో… మురిపించిన ముగింపు

2021లో అన్నీ చేదు జ్ఞాప‌కాలే. దాదాపు స‌గం రోజులు థియేట‌ర్లు తెర‌చుకోలేదు. 50 శాతం ఆక్యుపెన్సీ గండాన్ని దాటుకుని వ‌చ్చింది చిత్ర‌సీమ‌. అన్నీ ఒక ఎత్త‌యితే, ఏపీలో టికెట్ రేట్లు త‌గ్గించ‌డం మ‌రో ఎత్తు. కొన్ని థియేట‌ర్ల‌లో పాప్ కార్న్ కంటే… సినిమా టికెట్ చీప్ అయిపోవ‌డం విడ్డూరంగా క‌నిపించింది. దాంతో… కొన్ని థియేట‌ర్ల‌కు తాళాలు ప‌డ్డాయి. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా న‌డుపుతున్నార‌న్న కార‌ణంగా ఇంకొన్ని థియేట‌ర్ల‌న్ని ప్ర‌భుత్వ‌మే సీజ్ చేసింది. వ‌రుస ప‌రాజ‌యాలు సైతం చిత్ర‌సీమ‌ని కృంగ‌దీశాయి. ఇంత‌టి క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో డిసెంబ‌రు… చిత్ర‌సీమ‌ని ఆదుకుంది. ఈనెల‌లో విడుద‌లైన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డం, వ‌సూళ్ల పండ‌గ చేసుకోవ‌డం… టాలీవుడ్‌కి ఊపిరినిచ్చింది.

బాల‌కృష్ణ – బోయపాటి కాంబినేష‌న్‌లో రూపొందిన `అఖండ‌` టాలీవుడ్ కి మ‌ర్చిపోలేని విజ‌యాన్ని అందించింది. విడుద‌లైన ప్ర‌తీ చోటా… హౌస్ ఫుల్‌క‌ల‌క్ష‌న్ల‌తో హోరెత్తించింది. బాల‌య్య గ‌త చిత్రాల రికార్డుల‌న్నీ.. అఖండ తిర‌గ‌రాసింది. ఎప్పుడూ లేనిది, ఓవ‌ర్సీస్ లోనూ డాల‌ర్ల వ‌ర్షం కురిసింది. ఈ విజ‌యం… చిత్ర‌సీమ‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. డివైడ్ టాక్ లో సైతం.. `పుష్ప‌` త‌న త‌డాఖాని చూపించ‌గ‌లిగింది. విడుద‌లైన రోజు ద‌గ్గ‌ర్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ పుష్ప హంగామా కొన‌సాగుతూనే ఉంది. ఏపీలో టికెట్ రేట్లు భారీగా త‌గ్గించినా, పుష్ప నిల‌బ‌డ‌గ‌లిగింది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన‌… శ్యామ్ సింగ‌రాయ్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఏపీలో త‌క్కువ థియేట‌ర్లే దొరికినా.. అక్క‌డ సైతం మంచి వ‌సూళ్లే ద‌క్కించుకుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. దానికి త‌గ్గ‌ట్టుగానే వ‌సూళ్లు వ‌స్తున్నాయి. మొత్తానికి ఈ డిసెంబ‌రులో మూడు హిట్లు చూసింది చిత్ర‌సీమ‌. డిసెంబ‌రు 31న కూడా కొన్ని సినిమాలు వ‌స్తున్నాయి. మ‌రో హిట్టు ప‌డితే.. 2021కి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికి.. 2022ని సాద‌రంగా ఆహ్వానించుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close