2021 రివైండర్: కలసిరాని హీరోలు

2020లో చిత్ర పరిశ్రమని కరోనా కాటేసింది. ఆ ఏడాది ఎవరికీ కలసి రాలేదు. అయితే 2021కి పరిస్థితి కొంచెం తేరుకుంది. సినిమాలు ఒకొక్కటిగా థియేటర్ లోకి వచ్చాయి. అయితే ఇక్కడ విజయాలు కంటే అపజయాలు మూటకట్టుకున్నవారి సంఖ్యే ఎక్కువ. ముఖ్యంగా మీడియం హీరోలు దాదాపుగా అపజయాలనే చూశారు. ఒక్కసారి వివరాల్లోకి వెళితే..

బెల్లం కొండ శ్రీనివాస్: పక్కా కమర్షియల్ మీటర్ లో బెల్లం కొండ శ్రీనివాస్ చేసిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. అయితే సినిమా మాత్రం రొడ్డకొట్టుడు జాబితాలో చేరింది. తలాతోక లేని కధనంతో ప్రేక్షకులని పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమాతో ఏడాది ఆరంభంలో మొదటి ఫ్లాఫ్ ని మూటకట్టుకున్న హీరోగా నిలిచాడు బెల్లం కొండ శ్రీనివాస్.

నితిన్: నితిన్ నుంచి ఈ ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. ‘రంగ్ దే’ మంచి అంచనాల మీద వచ్చింది. సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘చెక్’ ది కూడా అదే పరిస్థితి. చంద్రశేఖర్ ఏలేటి లాంటి విలక్షణ దర్శకుడితో చేసినా ఫలితం దక్కలేదు. డిజాస్టర్ అయ్యింది. బాలీవుడ్ హిట్ అంధధూన్ ని ‘మాస్ట్రో’ గా రీమేక్ చేశాడు నితిన్. నేరుగా ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాని కూడా హిట్ అందుకోలేకపోయింది. కాపీ పేస్ట్ లా సినిమా తీసినప్పటికీ ఒరిజినల్ సినిమా చూపినంత ఇంపాక్ట్ మాస్ట్రో ఇవ్వలేకపోయింది. ఈ రకంగా నితిన్ కి 2021 పూర్తిగా కలసిరాలేదు.

సందీప్ కిషన్ : సందీప్ కిషన్ ఒక్క హిట్టు కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు. అయితే బ్యాడ్ లక్.. 2021 కూడా సందీప్ కిషన్ కి కలసి రాలేదు. ‘A1 ఎక్స్ ప్రెస్’, ‘గల్లీ రౌడీ’ .. రెండు సినిమాలు కూడా నిరాశ పరిచాయి. సందీప్ నటన పరంగా ఎలాంటి సమస్యలు లేవు. మంచి కథని పట్టుకోవడంలోనే సందీప్ తడబాటు కనిపిస్తుంది.

రాజ్ తరుణ్ : రాజ్ తరుణ్ సక్సెస్ ట్రాక్ తప్పి చాలా రోజులైయింది. అయితే ఈ ఏడాది కూడా మళ్ళీ ట్రాక్ లోకి రాలేకపోయాడు. జోనర్ మార్చి చేసిన’పవర్ ప్లే’ .. ఫ్లాఫ్ అయ్యింది. అన్నపూర్ణ లాంటి బ్యానర్ లో వచ్చిన ‘అనుభవించురాజా’ కూడా అదే రిజల్ట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ కథల పట్ల మంచి జడ్జ్మెంట్ వుందనే అభిప్రాయం వుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు రాజ్, ఆరంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. అయితే తర్వాతే రాజ్ లెక్క తప్పింది. రాజ్ మళ్ళీ మొదటికి వచ్చి తనకు ఎలాంటి కథలు నప్పుతాయో సరిగ్గా అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది

శర్వానంద్ : శర్వా నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చాయి. ‘శ్రీకారం’ మంచి ప్రయత్నం అన్నారు కానీ డబ్బులు రాలేదు. ‘మహాసముద్రం’ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు శర్వా. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. కానీ ఫలితం మాత్రం నిరాశ పరిచింది.

కార్తికేయ : ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయకి హిట్ లేదు. ఈ ఏడాది కూడా కలసిరాలేదు. గీతా ఆర్ట్స్ లో చేసిన ‘చావు కబురు చల్లగా’ నిరాశ పరిచింది. ‘రాజా విక్రమార్క్’ అంటూ ఓ స్టయిలీష్ సినిమా చేసినా .. అదీ ప్రేక్షకులకు నచ్చలేదు. మొత్తానికి ఈ ఏడాది రెండు ఫ్లాపులు చూడాల్సివచ్చింది.

విష్ణు: ‘మోసగాళ్ళు’ అంటూ ఓ పాన్ ఇండియా సినిమా చేశాడు విష్ణు. కాజల్, సునీల్ శెట్టి.. ఇలా భారీతారాగణం పెట్టుకున్నారు, భారీ సినిమా అనిప్రమోషన్స్ చేశారు. యాబై కోటు బడ్జెట్ అన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం, ఎవరినీ మెప్పించలేకపోయింది సినిమా.

రానా: చాలా గ్యాప్ తర్వాత రానా నుంచి వచ్చిన సినిమా అరణ్య. పాన్ ఇండియా సినిమా గా వచ్చింది. సినిమాలో రానా లుక్కు ఆసక్తిని పెంచింది, అయితే సినిమా మాత్రం నిరాశపరిచింది. రానా కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. విరాట పర్వం ఇంకా విడుదలకు నోచుకోలేదు. నేరుగా ఓటీటీకి ఇచ్చేసే ఆలోచనలు కూడా. భీమ్లా నాయక్ రావాల్సివుంది. ఇందులో రానా విలనీ పాత్ర. ఒరిజినల్ లో ప్రుద్వి రాజ్ చేసిన పాత్ర రానాది. అయితే తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి రానా పాత్రని తగ్గించేశారని టాక్. దానిపై ఫలితం ఎలా వుంటుందో చూడాలి.

నాగార్జున: చాలా ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నాగార్జున ‘వైల్డ్ డాగ్’. సినిమా మాత్రం ఫ్లాఫ్. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్లు సినిమా గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినప్పటికీ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ షో బిజీ అయిపోయారు నాగ్. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ బంగార్రాజుపైనే.

విశ్వక్ సేన్ :చాలా ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది విశ్వక్ సేన్ పాగల్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు విశ్వక్. అయితే విడుదలైన తర్వాత అంత గొప్పగా లేదు సినిమా. పైగా విశ్వక్ సేన్ అంటే ఒక మంచి టేస్ట్ వున్న నటుడనే పేరుంది. పాగల్ కంటెంట్ విశ్వక్ సేన్ ని మ్యాచ్ చేయలేకపోయింది. టోటల్ గా పాగల్ పై పెదవి విరిచారు ఫ్యాన్స్.

సాయి ధరమ్ తేజ్ : 2021 సాయిధరమ్ తేజ్ కి ఓ పీడకల. రిపబ్లిక్ ఫ్లాఫ్ అయ్యింది. సినిమా మాట పక్కన పెడితే.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు సాయి. రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు వారం రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. అదృష్టావశాత్తు క్షేమంగా బయటపడ్డాడు.

నాగశౌర్య : నాగశౌర్యకి కూడా ఈ ఏడాది కలసి రాలేదు. వరుడు కావలెను హిట్ అన్నారు కానీ నిజానికి యావరేజ్ దగ్గర ఆగిపోయింది. పైగా హీరోగా కూడా ఆ సినిమాతో శౌర్యకి కలిసొచ్చిన అంశం ఏమీ లేదు. పూర్తిగా ఫీమేల్ లీడ్ పై ఆధారపడిన స్టోరీ అది. రీతూ వర్మకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక చాలా కస్టపడి చేసిన ‘లక్ష్య’ సినిమా డిజాస్టర్ అయ్యింది. శౌర్యని చాలా డిస్సాపాయింట్ చేసింది లక్ష్య.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close