2021 రివైండర్ : టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్

ఈ ఏడాది ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటలున్నాయి. కొన్ని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మేలోడిస్ తో మ్యాజిక్ చేసిన సాంగ్స్ వున్నాయి. క్యాచి బీట్ తో అలరించిన డ్యాన్స్ నెంబర్లు వున్నాయి. వ్యూస్ తో వైరల్ అయిన పాటలు, ఆడియో2020 చివర్లో వచ్చి.. 2021ఆరంభంలో విడుదలైన సినిమాలు, విడుదలకు సిద్దమౌతున్న సినిమాలూ వున్నాయి. ఒక్కసారి వివరాల్లోకి వెళితే…

నీకళ్ళు నీలి సముద్రం : ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఉప్పెన ఒకటి. ఈ సినిమాలో పాటలు కూడా హిట్టే. ఇందులో ‘నీ కన్ను నీలీ సముద్రం” పాట వైరల్ అయ్యింది. ముఖ్యంగా యూత్ మళ్ళీ మళ్ళీ పాడుకున్నారు. శ్రీమణి రాసిన సాహిత్యమూ ఆకట్టుకుంది.

నీలి నీలి ఆకాశం: యాంకర్ ప్రదీప్ హీరోగా ”ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నుంచి వచ్చిన ‘నీలి నీలి ఆకాశం’ పాట విన్న సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది. చాలా మంది ఈ పాటతో రీల్స్ చేశారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా చక్కగా కుదిరింది.

మగువా మగువా: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి వచ్చిన మగువ పాట సూపర్ హిట్ పాటగా నిలిచింది. ఈస్త్రీ ఔనత్యం చాటే పాట సాహిత్యం ఉన్నతంగా కుదిరింది. సిద్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు.

లవ్ స్టొరీ : శేఖర్ కమ్ముల సినిమా నుంచి ఈ ఏడాది మరో మ్యూజికల్ హిట్ వచ్చింది. లవ్ స్టోరీలోని పాటలు బావున్నాయి. అందులో ‘సారంగ దరియా’ పాట డ్యాన్స్ నెంబర్ గా నిలిచింది. వ్యూస్ పరంగా కూడా ఈ పాట రికార్డులు సాధించింది. పాటలో సాయి పల్లవి డ్యాన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

ఒకే ఒక లోకం : అది హీరోగా చేసిన శశి సినిమా నుంచి ఒక చార్ట్ బస్టర్ వుంది. సిద్ శ్రీ రామ్ పాడిన ‘ఒకే ఒక ప్రాణం నీవే’ పాట యూత్ ని కట్టిపడేసింది. మెలోడి ప్రధానంగా సాగిన ఈ పాట చాలా మంది రింగ్స్ టోన్ గా మారుమ్రోగింది. ఈ ఒక్క పాటతో వరుణ్ అనే సంగీత దర్శకుడు వెలుగులోకి వచ్చాడు.

జాతి రత్నం చిట్టి: ఈ ఏడాది ఫన్ పంచిన సినిమా జాతి రత్నాలు. ఇందులో ‘చిట్టి నీ వవ్వంటే’ పాట తెగ సందడి చేసింది. సరదా సాగిపోయే సాహిత్యం, క్యాచి ట్యూన్, నవీన్ పోలిశెట్టి, ఫారియా లా క్యుట్ యాక్టింగ్ తో ఈ పాట వ్యూవర్స్ ఆకట్టుకుంది.

కళ్యాణ మండపంలో చుక్కల చున్నీ : కిరణ్ అబ్బవరం, ప్రియాంక జువల్కర్ జంటగా నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా ఈ ఏడాది అలరించింది. ఇందులో చుక్కల చున్నీ పాట ఆడియన్స్ ని తెగ నచ్చింది. చేతన్ భరద్వాజ్ సంగీతం, అనురాగ్ కులకర్ణి గానం, భాస్కర్ బట్ల సాహిత్యం అన్నీ చక్కగా కుదిరాయి. వ్యూస్ పరంగా కూడా ఈ పాట సూపర్ హిట్.

రంగ్ దే : నితిన్ రంగ్ దే ఆశించిన విజయం సాధించలేదు కానీ ఈ సినిమా ఆడియో మాత్రం ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ‘నా కనులు ఎపుడు’ పాట మళ్ళీమళ్ళీ విన్న పాట గా నిలిచింది. దేవిశ్రీ మరోసారి తన మెలోడి టచ్ తో ఆకట్టుకున్నాడు.

లేహరాయి : గోపి సుందర్ నుంచి ఈ ఏడాది కూడా ఓ హిట్ పాట వచ్చింది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో లేహరాయి పాట అలరించింది. సిద్ శ్రీ రామ్ పాడిన ఈ పాట చాలా మంది ఫోన్స్ లో రింగ్ టోన్ గా వినిపించింది. శ్రీమణి సాహిత్యం కూడా ఆకట్టుకుంది.

ప్రేమంటే ఏంటి ?: రాఘవేంద్ర రావు సినిమా అంటే పాటకు పెట్టింది పేరు. ఈ ఏడాది కూడా రాఘవేంద్ర రావు మార్క్ లో ఓ పాట హిట్ అయ్యింది. ‘పెళ్లి సందడి’ నుంచి ‘ప్రేమంటే ఏంటి’ అనే పాట యూత్ కి నచ్చింది. ఈ పాటకు పేస్ బుక్, ఇన్స్టా లో తెగ రీల్స్ చేశారు. ఏంఏం కీరవాణి మెలోడి లో లేతదనం తగ్గలేదనేదానికి ఈ పాట ఉదారణ. ఈ పాటలో రోషన్ శ్రీలీలా కెమిస్ట్రీ కూడా బావుంది.

రెండు జానపదాలు హిట్లే: జానపదం ఎప్పుడూ జనరంజకమే. వరుడు కావలెనులో ఉత్తారాది జానపదం ‘దిగుదిగునాద పాటని వాడారు. ఈ పాటలో రిక్రియేషన్ చక్కగా కుదిరింది. మళ్ళీ పాటని ఫ్రెష్ గా విన్న ఫీలింగ్ కలిగించింది. శ్రీదేవి సోడా సెంటర్ లో వాడిన మందులోడ పాట కూడా మాస్ కి తెగ నచ్చింది.

పుష్ప నుంచి రెండు: దేవిశ్రీ సుకుమార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురిది చార్ట్ బస్టర్ కాంబినేషన్. ఆ అంచనాలు తగ్గట్టు పుష్ప ఆడియో కూడా ఆకట్టుకుంది. ఇందులో రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సూపే బంగారం.. నా సామి పాటలు అలరించాయి. సూపే బంగారం పాటలో మరోసారి తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు సిద్ శ్రీరాం.

లాహే లాహే : మెగాస్టార్ చిరంజీవి ఆచార్యా ఇంకా విడుదల కాలేదు. కానీ ఆచార్య నుంచి వచ్చిన లాహే లాహే పాట జనాల్లో నోట్లో నానుతుంది. మెగాస్టార్, మణిశర్మలది హిట్ కాంబినేషన్. ఇప్పుడా మ్యుజిల్ కలయికని రిపీట్ చేస్తూ వచ్చిన ఆచార్యలో లాహే లాహే పాట హిట్ గా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా చక్కగా కుదిరింది.

ఫైనల్ టచ్ గా నాటు పాట: ఈ ఏడాదికి ఆడియో పరంగా ఫైనల్ టచ్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్. ఇందులో నుంచి వచ్చిన ‘నాటు నాటు’ పాట మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరిలోనూ హుషారు పెంచింది. మాస్ పల్స్ పట్టుకోవడంలో కీరవాణి హిట్టు. మాస్ కి నచ్చేలా సాహిత్యం రాయడంలో చంద్రబాస్ దిట్ట. చరణ్- ఎన్టీఆర్ ఒకటే ఫ్రేములో డ్యాన్స్.. ఈ మూడు ఎలిమెంట్స్ నాటు పాటని మరో లెవల్ కి తీసుకెళ్ళాయి. సోషల్ మీడియా తెరిస్తే చాలు.. నాటు పాట సాంగ్ కవర్ లో పేజీలు నిండిపోతున్నాయి. అంతలా జనాల్లోకి వెళ్ళిందీ పాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close