సినిమా పరిశ్రమ ఓ పుష్పక విమానం. ప్రతి ఏడాది కొత్తహీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఎంతమంది వచ్చినా ఇంకొకరికి ఛాన్స్ ఉంటూనే ఉంటుంది. కానీ అందులో కొందరు మాత్రమే ప్రేక్షుకుల్లో గుర్తింపు తెచ్చుకుని, వరస ఛాన్సులు అందుకొని పాతుకుపోతారు కొందరు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్లారో కూడా తెలియకుండా మిగిలిపోతారు. ఈ ఏడాది 2025 లో చాలా మంది కథానాయికలు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో కొంతమంది ఫేమ్ తెచ్చుకుని బిజీగా మారిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ లిస్టు తీస్తే…
ఈ యేడాది అందరికంటే టాప్ లో ఉంది భాగ్యశ్రీ బోర్సే . మిస్టర్ బచ్చన్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఈ ఏడాది తగినంత గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ దేవర కొండ నటించిన ‘కింగ్ డమ్’ , రామ్ తో ఆంధ్రా కింగ్ తాలుకా`, దుల్కర్ సల్మాన్ తో ‘కాంతా’ చేసింది. ఈ సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది. ఆ తరువాత చెప్పుకోవాల్సిన పేరు… రుక్మిణి వసంతన్. ఈ కన్నడ కస్తూరి సప్త సాగరాలు దాటి అనే కన్నడ సినిమాతో తెలువాళ్ళకి కూడా పరిచయం అయ్యింది. తరవాత నిఖిల్ తో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో నేరుగా తెలుగు తెరపై మెరిసింది. ప్రస్తుతం రుక్మిణి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో ఎన్టీఆర్ – నీల్ కాంబో డ్రాగన్ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా కాంతారా చాఫ్టర్ 1 తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కొట్టి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన నిధి శెట్టి తెలుగులో నాని తో హిట్ 3 లో నటించింది. తెలుసు కదాలో తనకు మంచి పాత్ర పడింది. ఇప్పుడు వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నిధి ఖాతాలో మరికొన్ని సినిమాలున్నట్టు తెలుస్తోంది. కాంతారా మూవీతో గుర్తింపు పొందిన సప్తమీ గౌడ్ కూడా తెలుగులో నితిన్ తమ్ముడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తేజా సజ్జా ‘మిరాయ్’ తో రితికా నాయక్ తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రితికా మొదటి సినిమా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనం లో అర్జున కళ్యాణం ‘. తరువాత హాయ్ నాన్న లో కూడా సహాయక పాత్రలో మెరిసింది. కానీ ఇవేవీ రితికా నాయర్ కి గుర్తింపు ఇవ్వలేదు మిరాయ్ తో మాత్రం గుర్తింపు తెచ్చుకొంది.
కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ తో యుక్తి తరేజా తెలుగులో అడుగుపెట్టింది. ‘లవ్ టుడే’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఇవానా శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీతో తెలుగులో తెరంగేట్రం చేసింది. మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాతో మలయాళ బ్యూటీ ప్రీతి ముకుందన్ , ‘మోగ్లీ’ మూవీతో సాక్షి మదోల్కర్ ఆడియన్స్ ని మెప్పించారు. భారీ బడ్జెట్ సినిమాలు , స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వారే కాకుండా కొన్ని చిన్న సినిమాల ద్వారా ప్రేక్షకులని మెప్పించిన భామలు కూడా ఉన్నారు. రాబోయే కాలంలో చిన్న హీరోలకి, చిన్న సినిమాలకి బెస్ట్ ఆప్షన్ గా మారారు.
