టీడీపీ 37వ ఆవిర్భావ దినోత్సవం..! మరో ఆత్మగౌరవ పోరాటం..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 37 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని పదిలం చేసుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రం సమాచారం ప్రజల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైన సందర్భం.

తెలుగువారి ఆత్మగౌరవం తెలుగుదేశం ..!

తెలుగుదేశం అంటే.. ఆత్మగౌరవ నినాదం. తెలుగు జాతి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం అది. ఢిల్లీ పెత్తనంపై చేసిన తిరుగుబాటు. ఎన్టీఆర్‌స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు… విమానాశ్రయంలో అవమానం జరిగింది. ఎలాంటి పదవి లేని రాజీవ్ గాంధీ.. ముఖ్యమంత్రిని తోసేయడం సంచలనం సృష్టించింది. దీంతో… తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించారు. అంతకు ముందే .. అరవై ఏళ్లు నిండిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు. అన్నట్లుగానే 1982 మార్చి 29న టీడీపీని ప్రారభించారు.అప్పుడు తెలుగువారికి సరైన గుర్తింపు లేదు. ఢిల్లీకి వంగి వంగి సలాములు కొట్టాల్సిన పరిస్థితి. దీన్ని ఎన్టీఆర్..తెలుగుదేశం పార్టీతో సమూలంగా మార్చి వేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆత్మగౌరవంతో… ఢిల్లీలోనూ రాజకీయాలు చేశారు. ప్రధానప్రతిపక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయపార్టీ తెలుగుదేశం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులే కొద్దిగా అటూ ఇటుగా ఇప్పుడూ కనిపిస్తున్నాయి.

ఢిల్లీని గడగడలాడించింది..! బడుగులకు రాజ్యాధికారం అందించింది..!

బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలోకి తెచ్చింది టీడీపీ. స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించినది తెలుగుదేశం. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్‌. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్‌ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేసింది తెలుగుదేశం. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా మారింది.

మరోసారి ముప్పులో తెలుగుజాతి..! ఆదే ఆత్మపోరాటం చేస్తున్న టీడీపీ..!

37 ఏళ్ల క్రితం మొగ్గతొడుక్కున్న పార్టీ జాతీయ స్థాయిలోనే ప్రత్యేకతను చాటుకుంది. ఆయన లేకున్నా ఆయన ఆదర్శాలు అలాగే ఉన్నాయి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని నడిపిస్తున్నారు చంద్రబాబునాయుడు. ఏకపక్ష పార్టీ విధానాలతో విసిగి వేసారిపోయి ఉన్న తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సాదర స్వాగతం పలకడమేకాదు కొద్దిరోజుల్లోనే అనితర సాధ్యమైన విజయాన్ని కట్టబెట్టి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు అప్పగించారు. మరోసారి తెలుగుజాతి ఆత్మగౌరవ పోరాటం చేస్తోంది. ఢిల్లీపై.. తిరగబడుతోంది. ఇలాంటి సందర్భంలో మరోసారి చంద్రబాబు ఆత్మగౌరవం పోరాటాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. ఆంధ్రుడ్ని అవమానిస్తున్న ఢిల్లీ అహంకారానికి బుద్ది చెప్పాలని.. టీడీపీ అధినేత అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. 37 పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకంటున్న సమంయలోనే … ఆంధ్రుడి ఆత్మగౌరవానికి మరోసారి ముప్పు వచ్చింది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన స్ఫూర్తిని తీసుకుని ఆత్మవిశ్వాసంతో ఢిల్లీపై పోరాడి తెలుగువారి సత్తా చాటేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close