ఈవారం బాక్సాఫీస్‌: ఐదు సినిమాల‌తో జాత‌ర‌

సెకండ్ వేవ్ త‌ర‌వాత‌.. సినిమాలు ఉధృతంగానే వ‌చ్చేస్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఒకే రోజు ఏడు సినిమాలు వ‌చ్చాయి. అందులో ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ‌మండ‌పం ఒక‌టే నిల‌బ‌డిగింది. ఆ సినిమాకి వ‌సూళ్లు బాగుండ‌డంతో – చిత్ర‌సీమ‌కు ఉత్సాహం వ‌చ్చింది. ఈ వారం కూడా కొత్త సినిమాల ఊపు క‌నిపించ‌డానికి కార‌ణం అదే. ఈవారం.. 5 సినిమాలు బ‌రిలో నిల‌వ‌బోతున్నాయి. అందులో అంద‌రి దృష్టీ విశ్వ‌క్ సేన్ `పాగ‌ల్‌` పైనే. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. నివేదా పేతురాజ్ క‌థానాయిక‌. ఈనెల 14న విడుద‌ల చేయ‌నున్నారు. నిజానికి ఓటీటీలో వెళ్లాల్సిన సినిమా ఇది. చివ‌రి క్ష‌ణాల్లో థియేట‌రిక‌ల్ రిలీజ్ గా మార్చుకున్నారు.

సునీల్ హీరోగా న‌టించిన `క‌న‌బ‌డుట‌లేదు` కూడా ఈవార‌మే వ‌స్తోంది. ఈనెల 13న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. క్రైమ్ నేప‌థ్యంలో సాగే థ్రిల్ల‌ర్ ఇది. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. దాంతో ఈ సినిమాపై ఫోక‌స్ ప‌డింది. `సుంద‌రి`, `బ్రాందీ డైరీస్`, `ఒరేయ్ బామ్మ‌ర్ది` సినిమాలు కూడా 13నే వ‌స్తున్నాయి. ఈ చిత్రాల జాత‌కం బ‌ట్టి.. ఆగ‌స్టు సినిమాల ప‌రిస్థితి ఆధార‌ప‌డి వుంది. ఆగ‌స్టు 20, 27న కూడా కొన్ని కొత్త చిత్రాలు విడుద‌ల కావాల‌ని చూస్తున్నాయి. ఈవారం బాక్సాఫీసు కాస్త క‌ళ‌క‌ళ‌లాడితే – ఈ నెలంతా కొత్త సినిమాల జాత‌ర చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close