నందమూరి బాలకృష్ణ అందగాడు. ఈ విషయంలో డౌటే లేదు. కాకపోతే.. బాలయ్యని చూపించడం తెలిసి ఉండాలి. ఈ విషయంలో బోయపాటి శ్రీను డిగ్రీలూ, పీహెచ్‌డీలూ చేసేశాడు. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలయ్య అందంగా కనిపించాడు. అఖండలోనూ అంతే. మురళీకృష్ణ పాత్రలో ఛార్మ్ ఉంది. తన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. విగ్గయితే.. పర్‌ఫెక్ట్ గా సూటయ్యింది. సాధారంగా బాలయ్యకు విగ్గుల దగ్గరే సమస్య. ఒక్కో సినిమాలో ఒక్కేలా విగ్ ఉంటుంది. కొన్నిసార్లు… విగ్గులు కుదరకపోవడం వల్ల, ఎఫెక్ట్ బాలయ్యపై, ఆ తరవాత సినిమాపై పడుతుంది. కానీ బోయపాటి మాత్రం ఈ విషయంలో రాజీ పడడు. అఖండలో కేవలం విగ్గుల కోసమే.. రూ.50 లక్షలు ఖర్చు పెట్టించాడని టాక్. మురళీకృష్ణగా బాలయ్య వాడిన విగ్గు ధర రూ.13 లక్షలు. అలాంటి విగ్గులు ఈసినిమా మొత్తమ్మీద 3 వాడారు. అంటే వాటికే 39 లక్షలు అయ్యింది. కేవలం ఈ విగ్గుని అతికించడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి ముంబై నుంచి హెయిర్ డ్రస్సర్‌ని తీసుకొచ్చారు. సినిమా మొత్తమ్మీద అతనికి అయిన ఖర్చు దాదాపు 12 లక్షలు. అలా.. ఈ విగ్గు కోసం 50 లక్షలు ఖర్చు పెట్టాల్సివచ్చింది.