ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబం పేరిట ఉన్న ఆస్తులను ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. వరుసగా ఆరో సంవత్సరం తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్న లోకేష్… ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించబోయే ఆస్తులు తప్ప తమవద్ద మరో రూపాయి కూడా ఎక్కువ లేదన్నంత స్ట్రాంగ్ గా సవాల్ చేశారు. ఇదే సమయంలో రాజకీయ భవిష్యత్తుపై కూడా మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. 2019 లో పార్టీ టిక్కెట్ ఇస్తే తప్పకుండా పోటీచేస్తానని ప్రకటించారు. అలాగే తాను మంత్రివర్గంలోకి వచ్చే విషయం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి…
- చంద్రబాబు నికర ఆస్తులు:: రూ.3.73కోట్లు
హైదరాబాద్ లోని ఇంటి విలువ – 3.68కోట్లు
అంబాసిడర్ కారు విలువ – 1.52లక్షలు
బ్యాంక్ ఖాతాలోని నగదు – రూ.3.59లక్షలు
చంద్రబాబు పేరిట ఉన్న బ్యాంకు రుణం – 3.06కోట్లు - నారా భువనేశ్వరి మొత్తం ఆస్తులు:: రూ.38.66కోట్లు
భువనేశ్వరి పేర ఉన్న అప్పులు – రూ.13కోట్లు
నికర ఆస్తులు – రూ.24.84కోట్లు
పంజాగుట్టలో స్థలం – రూ.73లక్షలు
మదీనాగూడలోని భూమి – రూ.73లక్షలు
తమిళనాడులో భూమి – రూ.1.86కోట్లు
హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాలు – రూ.19.95కోట్లు
వివిధ కంపెనీల్లో వాటాలు – రూ.3.23కోట్లు
బంగారు అభరణాలు – రూ.1.27కోట్లు
కారు విలువ – రూ.91లక్షలు - నారా లోకేశ్ మొత్తం ఆస్తులు – రూ.14.50కోట్లు
మొత్తం అప్పులు- రూ.6.35కోట్లు
నికర ఆస్తులు – రూ.8.15కోట్లు
హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాలు – రూ.2.52కోట్లు
ఇతర కంపెనీల్లోని వాటాలు – రూ.1.64కోట్లు
కారు విలువ – రూ.93లక్షలు - నారా బ్రాహ్మణి నికర ఆస్తులు – రూ. 12.33 కోట్లు
అప్పులు – రూ. 42 లక్షలు
మాదాపూర్ లో స్థలం – రూ. 17 లక్షలు
జూబ్లిహిల్స్ లో ఇంటి విలువ – రూ. 3 కోట్ల 50 లక్షలు
హెరిటేజ్ లో వాటా – రూ.78 లక్షలు
బంగారు ఆభరణాల – రూ. 15 లక్షలు
పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ము – రూ. 19 లక్షలు
నగదు నిల్వ – రూ. 25 లక్షలు - నారా దేవాన్ష్ పేరున ఫిక్సిడ్ డిపాజిట్లు – రూ.2.4కోట్లు
జూబ్లీహిల్స్ లో ఇంటి విలువ – రూ.9.17కోట్లు
నగదు నిల్వ – రూ.2.31లక్షలు
ఈ తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి ఉన్న ఆస్తుల సంగతి కాసేపు పక్కనపెడితే వారి కుటుంబానికున్న అప్పులు సుమారు రూ.22 కోట్ల 41లక్షలుగా ఉన్నాయి.