వ‌ర్మ వ‌ల్ల‌.. ’90 ఎం.ఎల్‌’కి బ్రేక్

కార్తికేయ న‌టించిన ’90 ఎం.ఎల్‌’ రేపు (గురువారం) విడుద‌ల కావాల్సివుంది. అయితే ఇంకా సెన్సార్ ఇంకా పూర్త‌వ‌లేదు. ప్ర‌స్తుతం సెన్సార్ బోర్డు ఈ సినిమా చూస్తోంది. సినిమా పూర్త‌యి, సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇచ్చేలోగా పుణ్య‌కాలం గ‌డిచిపోతుంది. అంటే రేపు ఈ సినిమా విడుద‌ల కానట్టే. శుక్ర‌వారం ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి.

90.ఎం.ఎల్ అనే టైటిల్ అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని, ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు మ‌ద్య‌పానాన్ని ప్రోత్స‌హించేలా ఉన్నాయ‌ని అందుకే సెన్సార్ జ‌ర‌గ‌లేద‌ని వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి అలాంటి స‌మ‌స్యేం లేదు. ఈ సినిమా ఆగిపోవ‌డానికి మాత్రం ప్ర‌ధాన కార‌ణం.. రాంగోపాల్ వ‌ర్మ తీసిన ‘క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప‌ రెడ్లు’.

సెన్సార్ స‌ర్టిఫికెట్ కోసం నిర్మాత‌లు ద‌ర‌ఖాస్తు చేసుకుంటుంటారు. ఎవ‌రు ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆ క్ర‌మంలోనే సెన్సారు బోర్డు సినిమా చూడాలి. కాక‌పోతే… ఎవ‌రి సినిమా ముందుగా విడుద‌ల‌కు ఉంటుందో, వాళ్ల సినిమాని సెన్సార్ చేయ‌డం ఓ అల‌వాటుగా వ‌స్తోంది. చివ‌రి నిమిషాల్లో విడుద‌ల తేదీ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన సినిమాలు… సెన్సార్ కోసం వ‌స్తుంటాయి. వాళ్ల అవ‌స‌రాల రీత్యా.. వ‌రుస క్ర‌మంలో వ‌చ్చిన సినిమాల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ సెన్సార్ చేస్తుంటారు. అయితే ఈ నిబంధ‌న విష‌యంలో సెన్సార్ బోర్డు ఇటీవ‌ల కాస్త క‌ఠినంగా మారిన‌ట్టు తెలుస్తోంది. వ‌ర్మ సినిమా సెన్సార్ ఇష్యూ వ‌చ్చిన త‌ర‌వాత మ‌రే ఇత‌ర వివాదాల జోలికీ పోకుండా ఉండేందుకు సెన్సార్ బోర్డు ఈ రూల్‌ని ప‌క్కాగా పాటించాల‌ని అనుకుంటుంద‌ట‌. అందుకే.. ’90 ఎం.ఎల్’ కంటే ముందు ద‌ర‌ఖాస్తు చేసుకున్న సినిమాలు పూర్త‌యిన త‌ర‌వాతే.. మీ సినిమాకి సెన్సార్ చేస్తామ‌ని చెప్ప‌డంతో సెన్సార్ ఆల‌స్య‌మైంద‌ని తెలుస్తోంది.

ఇప్పుడు ‘వెంకీ మామ‌’ సెన్సార్‌కీ ఇవే తిప్ప‌లు త‌ప్ప‌క‌పోవొచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ హ‌డావుడిగా ప్ర‌క‌టించేశారు. ఈనెల‌లో విడుద‌ల కావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ లిస్టు ప్ర‌కారం.. వెంకీ మామ సెన్సార్ చేయ‌డానికి చాలా టైమ్ ఉంది. సో.. వెంకీ మామ‌కూ.. ఈ టెన్ష‌న్ త‌ప్ప‌క‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close