తుఫాను బాధితులకు అండగా నిలుస్తున్న నటుడు సిద్దార్థ

చెన్నై నగరాన్ని మళ్ళీ బారీ వానలు ముంచెత్తాయి. నగరంలో లోతట్టు ప్రాతాలన్నీ నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నపటికీ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో చెన్నైలో పరిస్థితులు ఇంకా దిగజారుతూనే ఉన్నాయి. ప్రముఖ నటుడు సిద్దార్ధ ఇంటిలోకి కూడా నీళ్ళు వచ్చి చేరడంతో అతను కూడా వేరే ఇంటికి మారవలసి వచ్చింది.

ఆ ఫోటోలను ట్వీటర్ లో పోస్ట్ చేసి “నావంటి వారి పరిస్థితే ఈవిధంగా ఉంటే, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును,” అని మెసేజ్ పెట్టారు. అప్పుడే అతనికి ఈ పరిస్థితి తీవ్రత, ప్రజలు పడుతున్న బాధలు అర్ధమయ్యాయి. ఇక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా ఆయన కూడా సహాయ చర్యలకి నడుం కట్టారు. తను స్వయంగా పాల్గొనడమే కాకుండా తన స్నేహితులని, ప్రజలని అందరినీ కూడా సహాయ చర్యలలో పాల్గొనమని ట్వీటర్ ద్వారా మెసేజ్ పెట్టారు. సహాయ చర్యలలో పాల్గొనదలచినవారు, వాహనాలు, ఇళ్ళు ఇవ్వదలచినవారు తనని, తన స్నేహితుడు ఆర్.జె.బాలాజీని సంప్రదించాలని కోరారు.

ఇప్పటికే ఆయన కొంతమందిని తన కార్యాలయం, ఇళ్ళలో ఆశ్రయం కల్పించారు. ముంపు ప్రాంతాలలో చిక్కుకొన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, వారిని ఉంచేందుకు అపార్టుమెంటులు ఉన్నవారు ముందుకు రావాలని అభ్యర్ధించారు. అందుకు ప్రజల నుండి మంచి స్పందనే వస్తోంది. ఈరోజు నుండి సిద్దార్ధ అతని స్నేహితులు కలిసి ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టబోతున్నారు. సిద్దార్ధ చేస్తున్న ఈ మంచి పనికి అందరూ తమ శక్తిమేర సహకరిస్తే బాగుంటుంది. మిగిలిన నటులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలు, రాజకీయ నాయకులు వారి పార్టీలు కూడా ఈ సహాయ పునరావాస చర్యలలో పాల్గొనవలసిన బాధ్యత ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close