ఒకనాటి ఖైదీ జైళ్ళ వ్యవస్థలోనే సమూలమార్పులు తీసుకొస్తున్నాడు!

హైదరాబాద్: గతంలో జైలు శిక్ష అనుభవించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దేశంలో జైళ్ళ పనితీరులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ రూపొందించాడు. ఫీనిక్స్(పునరుజ్జీవం పొందే పక్షి) అనే ఈ సాఫ్ట్‌వేర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ళలో ఉపయోగించటానికి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ తన ఆమోదాన్ని తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను నాలుగు ఐటీ కంపెనీలు, వివిధ రాష్ట్రాలలోని జైళ్ళలో ఇన్‌స్టాల్ చేయటంకోసం, కొనుగోలు చేశాయి.

భార్య ఆత్మహత్య చేసుకోవటానికి కారణమనే ఆరోపణతో యూపీలోని గోరఖ్‌పూర్‌‍కు చెందిన అమిత్ మిశ్రా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 2013లో జైలు పాలయ్యాడు. జైలులో ఉన్న సమయంలో లోలోపల కుమిలిపోవటం కాకుండా, జైళ్ళ పనితీరును అధ్యయనం చేశాడు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారుచేశాడు. ఇది మూడు లెవల్స్‌లో పనిచేస్తుంది. మొదటి లెవల్‌లో జైలులో ఉండే నిందితులు, ఖైదీలు, వారి చిరునామాలు, వారిమీద ఉన్న కేసులు, ఆ కేసుల స్టేటస్ వంటి సమాచారమంతా ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. రెండో లెవల్‌ జైళ్ళ పాలన, నిర్వహణలకు సంబంధించినది. ఒక్కసారి నిర్దేశిత జైల్ సమాచారాన్ని దానిలోకి ఎక్కిస్తే ఇక ప్రతిసారీ దానిలోకి డేటాను ఎంటర్ చేస్తుంటే సరిపోతుంది. మూడో లెవల్‌లో ఖైదీలు, నిందితులు తమ కేసుల, శిక్షల, వ్యక్తిగత జైలు జీవిత సమాచారాన్ని ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అమిత్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలు తర్వాతి కాలంలో వీగిపోవటంతో అతను ప్రస్తుతం గురగావ్‌లో ఒక ఐటీ కంపెనీకి అధినేతగా పనిచేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close