డిసెంబ‌ర్ 18న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ధ‌నుష్ ‘న‌వ‌మ‌న్మథుడు

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో రాణిస్తూ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన మాస్, కమర్షియల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నధ‌నుష్ హీరోగా స‌మంత‌, ఎమీజాక్స‌న్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘తంగ మ‌గ‌న్‌’. ఈ చిత్రాన్ని’న‌వ‌మ‌న్మ‌థుడు’ అనే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. డి.ప్ర‌తాప్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బృందావ‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. వేల్ రాజ్ ద‌ర్శ‌కుడు. ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్ నిర్మాత‌లు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

చిత్ర నిర్మాత‌లు ఎన్‌.వెంక‌టేష్‌, ఎన్‌.ర‌వికాంత్ మాట్లాడుతూ ‘’ధ‌నుష్ విల‌క్ష‌ణ‌మైన హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శించే హీరో. త‌మిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. గ‌తంలో ధ‌నుష్‌తో ర‌ఘువ‌ర‌న్ బి.టెక్(త‌మిళంలో వేలై ఇల్లాద ప‌ట్ట‌దారి) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన వేల్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ల‌వ్‌, యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా సినిమా రూపొందింది. యువ సంగీత కెర‌టం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఆడియో డిసెంబ‌ర్ 11న విడుద‌ల‌వుతుంది. అలాగే సినిమాను డిసెంబ‌ర్ 18న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః అనిరుధ్ ర‌విచంద్రన్, కెమెరాః ఎ.కుమర‌న్‌, ఎడిటింగ్ః ఎం.వి.రాజేష్‌కుమార్‌, స‌హ నిర్మాత‌లుః ఎం.డి.ఎం.ఆంజ‌నేయ‌రెడ్డి, కె.య‌స్‌.రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః వేల్‌రాజ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close