శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ‘టైటానిక్’

రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’. ‘అంత‌ర్వేది టు అమ‌లాపురం’ ట్యాగ్ లైన్. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా…

స‌హ నిర్మాత అట్లూరి సురేష్‌బాబు మాట్లాడుతూ ‘’’టైటానిక్’ చిత్రం ఫుల్ ప్యామిలీ కామెడి ఎంటర్‌టైన‌ర్‌. ‘అంత‌ర్వేది నుండి అమ‌లాపురం’ వ‌ర‌కు గోదావ‌రి న‌దిలో టైటానిక్ అనే లాంచీలో జ‌రిగే క‌థే ఇది. పెళ్ళి బృందం కామెడితో సినిమా సరదాగా సాగుతుంది. నిర్విరామంగా చిత్రీకరణను జరిపి రెండు సాంగ్స్, 18 రోజుల టాకీని పూర్తి చేశాం. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో పెళ్ళి కొడుకుగా న‌టిస్తుంటే ర‌ఘుబాబు విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అలాగే జ‌బ‌ర్‌ద‌స్త్ టీం, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఏఎన్నార్, జూనియర్ కృష్ణ, జూనియర్ పవన్ కళ్యాణ్ కామెడి సినిమాకు ప్లస్ అవుతుంది. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్ ను టైటానిక్ గా రూపొందించి షూటింగ్ చేస్తున్నాం. కోరుకొండలోని నరసింహస్వామి దేవాలయంలో 200 జూనియర్ ఆర్టిస్ట్ లతో క్లయిమాక్స్ పూర్తి చేశాం. అలాగే 200 మంది జూనియర్ నటులతో జాతర అట్మాస్పియర్ లో హీరో ఇంట్రడక్షన్, మొదటి సాంగ్ ను చిత్రీకరిస్తాం. రాజ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌కు వినోద్ యాజ‌మాన్య సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు.

పృథ్వీ, ర‌ఘుబాబు, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్ః స్వామిరారా, పిల్ల జమీందార్ చిత్రాల ఫేమ్ చంద్రకిరణ్, ఫైట్స్ః రాం సుంక‌ర‌, ఆర్ట్ః ర‌ఘుకుల‌క‌ర్ణి.కె, మ్యూజిక్ః వినోద్ యాజ‌మాన్య‌, ఎడిట‌ర్ః ఎమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః అమర్, స‌హా నిర్మాతః అట్లూరి సురేష్ బాబు, నిర్మాతః కె.శ్రీనివాస‌రావు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: జి.రాజ‌వంశీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close