ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా వడ్డీవ్యాపారులపై దాడులు

హైదరాబాద్: కాల్‌మనీ వ్యాపారులపై, అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న కలెక్టర్‌లకు, పోలీస్ ఉన్నతాధికారులకు ఖరాఖండిగా చెప్పటంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కాల్‌మనీ వ్యాపారులు, అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, కడప జిల్లాలలో పోలీసులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు. విజయవాడ చిట్టినగర్, మాచవరంలో ఇవాళ దాడులు జరిపారు… టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావును, గుర్రం కొండ అనే మరో కాల్ మనీ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, చీరాల పట్టణాలలో, తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో, కడపజిల్లా పొద్దుటూరు, పులివెందుల, రాయచోటి పట్టణాలలో, గుంటూరు జిల్లా శారదాకాలనీలో కూడా ఈ దాడులు జరిగాయి. వడ్డీ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ పరిణామంతో వడ్డీ వ్యాపారులు షాక్‌కు గురయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close