నువ్వో నేనో చూసుకుందామా బిజెపి మంత్రి x దేశం జడ్ పి చైర్మన్

కార్యకర్తల స్ధాయిలో బిజెపిని తెలుగుదేశం గుర్తించడం లేదు. బిజెపి ప్రజాపతినిధులు వున్నచోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రెండో ప్రాధాన్యతే లభిస్తోంది. ఈ కారణంగా రెండు పార్టీల మధ్యా తగాదాలు ముదురుతున్నాయి.

ఇందుకు క్లయిమాక్స్ అన్నట్టు రెండు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో బిజెపి నాయకుడైన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు, తెలుగుదేశం నాయకుడైన పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు ముళ్ళపూడి బాపిరాజుకి మాటా మాటా పెరిగింది. జగన్ పార్టీనుంచి వలస వచ్చిన వారికే మంత్రి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం వారికి చిన్నచూపు చూస్తున్నారని, ప్రొటోకాల్ ను కూడా పట్టించుకోవడం లేదని జిల్లా పరిషత్ చైర్మన్ ఆరోపించారు. అసలు తెలుగుదేశం వాళ్ళు బిజెపి కార్యకర్తలను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి ఎద్దేవా చేశారు.

దీంతో మాటామాటా పెరిగి ”నువ్వో నేనో చూసుకుందామా” అని సవాళ్ళు విసురుకునే వరకూ పరిస్ధితి ముదిరింది. ఇందుకు ప్రత్యక్ష సాక్షిగా వున్న రవాణామంత్రి శిద్దా రాఘవరావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు.

175 మంది ఎమ్మెల్యేలు 25 మంది లోక్ సభ సభ్యులు వున్న ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి, ఒక ఎమ్మెల్సీ బిజెపి నుంచి చట్టసభల్లో వున్నారు. ప్రొటోకాల్ హోదాలు వున్నవారి సిఫార్సులు ఆదేశాలు చెల్లుతాయి కాబట్టి కార్యకర్తలు, ప్రజలు – ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే వుంటారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ లోక్ సభా స్ధానంలో అదేపార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్య్యేగా వున్నారు. మిగిలిన సెగ్మెంట్లలో తెలుగుదేశం వారు ఎమ్మెల్యేలుగా వున్నారు. ఇందువల్ల అక్కడ రెండు పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరుల పనులు సజావుగా జరిగిపోతున్నాయి. రెండు పార్టీల మధ్యా రోడ్డున పడే స్ధాయిలో తగాదాలు లేవు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వన్ అసెంబ్లీ నుంచి బిజెపి నాయకుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఎన్నికయ్యారు. రాజమండ్రి టూ నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. ఇద్దరి మధ్యా ”సరిహద్దు తగాదాలు” వున్నాయి. ఒకప్పుడు పత్రికల్లో సవాళ్ళు విసురుకున్నారు. ఒక ఇసుక రేవుదగ్గర ప్రత్యక్షంగానే మాటలు విసురుకున్నారు. డాక్టర్ ఆకుల సైలెంట్ గా విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర పంచాయతీ పెట్టడం వల్లో, బుచ్చయ్య సంయమనం పాటించడం వల్లో గాని ఇద్దరు బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోవడం లేదు. డాక్టర్ ఆకుల నాలుగైదేళ్ళుగానే రాజకీయాల్లో వున్నారు. అందువల్ల బిజిపి కార్యకర్తలకు ఈయనకూ మధ్య సుదీర్ఘమైన అనుబంధమేదీ లేకపోవడం కూడా తగాదా ముదరకపోవడానికి ఒక కారణం!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా వున్న మంత్రి మాణిక్యాలరావు సుదీర్ఘకాలం నుంచీ బిజెపిలో వున్న నిరాడంబరుడైన నాయకుడు. పట్టుదలే వచ్చినపుడు ”మన మాణిక్యాల రావేగదా” అనుకోడానికి చోటివ్వని గట్టి మనిషి.

కృష్ణా జిల్లా కైకలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్యవైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ “అసలు ఈయన బిజెపి నాయకుడేనా” అనుకునేటంతగా తెలుగుదేశంతో కలసిమెలసి పని చేస్తూంటారు.

బిజిపి జాతీయకార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక బిజిపి తెలుగుదేశం సంబంధాల్లో మార్పు వచ్చింది. రాజమండ్రిలో నివాసముండే వీర్రాజు ప్రజలనుంచి పిటీషన్లు విన్నపాలు స్వీకరిస్తూ ఆయా అంశాలపై అధికారులను నిలదీయడం మొదలైంది. తెలుగుదేశం వారికి వుండే మొహమాటం ఆయనకు లేదు. మిత్రపక్షమైనా కూడా రాష్ట్రప్రభుత్వం తీరుతెన్నుల మీద కేంద్రానికి ఫిర్యాదు చేయడం, బహిరంగ విమర్శలు చేయడం వీర్రాజుతోనే మొదలైంది. ఆనేపధ్యంలోనే బిజెపి తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశమై పరస్పరం బహిరంగ విమర్సలు ఆపెయ్యాలని నిర్ణయించారు. అప్పటినుంచీ వీర్రాజు మౌనంగా వున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వ అవకతవకల గురించి పార్టీకి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చే పనిలో వున్నారు.

సొంతపార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల పార్టీ ముఖ్యులను ఇన్ చార్జ్ లుగా నియమించి వారి సూచనలనే అధికారులు అమలు చేసే ఒక అనధికారిక ఏర్పాటుని చంద్రబాబే ప్రవేశ పెట్టారు. నాలుగు బిజెపి స్ధానాలతో సహా 66 వైఎస్ ఆర్ కాంగ్రెస్ నియోజక వర్గాల్లో ఇన్ చార్జ్ లను నియమించాలని ఆయా నియోజకవర్గాల నుంచి తెలుగుదేశంలో గట్టి వత్తిడి వుంది. ఇన్ చార్జ్ లకే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే సాంప్రదాయం వుండటం వల్ల ఈ పోస్టులకోసం పోటీ, వత్తిడీ కూడా ఎక్కువే వున్నాయి. దీంతో ఇన్ చార్జ్ ల నియామకంలో తటపటాయింపు సాగుతోంది.

నలుగురే బిజెపి ఎమ్మెల్యేల వున్నా రెండుచోట్ల బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య తగాదాలు తీవ్రంగా వున్నాయి. ఇందులోనే ఒకచోటైతే స్వయంగా బిజెపి మంత్రే జిల్లాపరిషత్ చైర్మన్ ని “నువ్వో నేనో చూసుకుందామా”అన్నారంటే సంబంధాలు దెబ్బతినే తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close