ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇదివరకు ఈ-బ్రిక్ పేరిట ప్రభుత్వం భారీగా విరాళాలు సేకరించింది. అనేకమంది రైతులు, ప్రజలు కూడా స్వచ్చందంగా విరాళాలు ఇచ్చేరు. ఇంకా అపుడప్పుడు ఇస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1800 కోట్లు ఇచ్చింది. మెకన్సీ అనే సంస్థ రాజధాని నిర్మాణానికి రాగల ఐదేళ్ళలో కనీసం 60,000 కోట్లు అవసరం ఉంటుందని, వాటిలో సగం మొత్తం మౌలిక వసతుల కల్పనకే సరిపోతుందని అంచనా వేసింది. రాజధానిలో శాసనసభ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు వంటి ప్రధాన భవనాల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకి కలిపి మొత్తం రూ.22,000 కోట్లు మాత్రమే ఇవ్వబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది కనుక మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ మొత్తాన్ని అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి ఆ మొత్తాన్ని సేకరించుకోవలసి ఉంటుందని మెకన్సీ సూచింది.

ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక సచివాలయం నిర్మించడానికి సిద్ధం అవుతుండటం విశేషం. ఒకవైపు ఈవిధమయిన విచిత్రమయిన ఆలోచనలు చేస్తూ మళ్ళీ రాజధాని నిర్మాణానికి విద్యార్ధుల నుండి రూ.10 చొప్పున విరాళాలు వసూలు చేయాలని నిర్ణయించుకొని అందుకు ఒక సర్క్యులర్ జారీ చేసింది.

సహజంగానే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా ప్రజా ధనం దుబారా చేస్తూ మళ్ళీ పేద విద్యార్ధుల నుండి కూడా బలవంతంగా విరాళాలు సేకరించడాన్ని వైకాపా తప్పు పట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా పడింది. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు స్టే విధించింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకే జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న తెదేపా నేతలకు హైకోర్టు స్టే విధించడంతో మరింత అప్రదిష్ట మూటగట్టుకొన్నారు. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ళలో చదువు (కొను)కొనే ఆర్ధికశక్తి లేనివాళ్ళే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటుటారు. వారికి ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ యూనిఫారం వంటివన్నీ సమకూర్చుతోంది. అనేక పాఠాశాలలో విద్యార్ధులు కూర్చోవడానికి బల్లలు కూడా ఉండవు. బాలికల పాఠాశాలలో మరుగుదొడ్లు కూడా ఉండవు. అనేక మంది విద్యార్ధులు కాలికి చెప్పులు కూడా లేకుండా మైళ్ళ దూరం నుంచి నడిచి వస్తుంటారు. వారిలో చాలా మంది బడికి వెళితే కనీసం ఒక్క పూట అయినా ఆహారం దొరుకుతుందనే ఆశతోనే వస్తుంటారు. అటువంటి వారి నుండి పదిపైసలు ఆశించడం కూడా తప్పే అవుతుంది. వీలయితే ప్రభుత్వమే వారికి ఇంకా మరి కొంత సదుపాయాలూ, పౌష్టికాహారం, దుస్తులు వంటివి సమకూర్చాలని ఆశించడం అత్యాశేమి కాదు.

“ప్రజా రాజధానిలో విద్యార్ధులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లయితే వారు కూడా స్ఫూర్తి పొందుతారనే సదుదేశ్యంతోనే విద్యార్ధులను విరాళాలు ఇమ్మని కోరాము తప్ప ఎవరి దగ్గర బలవంతంగా వసూలు చేయలేదని” గుంటూరు జిల్లా తెదేపా అద్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు. వైకాపా ప్రతీ చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోందని, రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు.

తెదేపా వాదన సరైనదే కావచ్చును. ఎందుకంటే విద్యార్ధులు ఇచ్చే ఆ చిన్న మొత్తం వలన రాజధాని నిర్మాణం పూర్తయిపోదు. కానీ రాజధాని నిర్మాణానికి తాము కూడా విరాళం ఇచ్చామనే తృప్తి, ఆనందం, గర్వం విద్యార్ధులకు కలుగుతాయి. అయితే ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, తెదేపా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, తెదేపా కాంట్రాక్టర్లు మొదలయినవారందరూ కూడా యధాశక్తిగా రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన తరువాత, విద్యార్ధులను విరాళాలు అడిగి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ డబ్బు, అధికారం ఉన్నవాళ్ళు ఎవరూ ఒక్క పైసా విరాళం ఇవ్వకుండా బడికి వెళ్ళే విద్యార్ధులను విరాళం ఇమ్మని అడగడాన్ని ఎవరూ హర్షించలేరు. ఇందులో రాజకీయం చేయడానికి ఏమి లేదు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close