ఆమిర్‌ఖాన్‌కు షాక్: యాడ్ కాంట్రాక్ట్ రద్దు చేసిన కేంద్రం

హైదరాబాద్: మత అసహనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలుగా ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమిర్ ఖాన్‌ను ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందునే ఈ కాంట్రాక్ట్ రద్దు చేశారన్న వాదనను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కొట్టి పారేసింది. కాంట్రాక్ట్ ముగిసినందునే ఆయనను తొలగించామని వివరణ ఇచ్చింది. అతిథి దేవోభవ క్యాంపెయిన్‌కోసం తాము మెక్ క్యాన్ ఏజెన్సీతో తాము కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని, ఆ ఏజెన్సీ ఆమిర్‌ సేవలను వినియోగించుకుందని కేంద్ర పర్యాటకశాఖమంత్రి మహేష్ శర్మ చెప్పారు. ఆ ఏజెన్సీతో తమ కాంట్రాక్ట్ ముగిసిపోయిందని, ఆమిర్‌ను తాము కుదుర్చుకోలేదని తెలిపారు. ఆ ఏజెన్సీతో కాంట్రాక్ట్ ముగిసిపోయింది కాబట్టి ఆమిర్‌ ఆ క్యాంపెయిన్‌లో ఉండబోరని చెప్పారు. ఆమిర్ చేసిన ఆ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా అతనిపై నిరసనలు వెల్లువవటం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ రూ. 14వేల కోట్లు మంగళవారం ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పడం లేదేంటి ?

తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ...

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close