భక్తి: సాయి సత్యవ్రతం ఎలా ప్రారంభమైంది?

కష్టాల్లో చిక్కుకున్న వారు తమ కష్టాలు దైవకృపతో తొలగిన తర్వాత సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. షిర్డీ సాయి సత్య వ్రత విధానం మొదటి నుంచీ లేదు. ఒక భక్తుడు (భీమాజీ పటేల్) కష్టాలను బాబా తొలగించడంతో అతను చాలా నిష్ఠగా సాయి సత్య వ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం విధిపురస్సరంగా ఈ వ్రతాన్ని చేసేవాడు. భీమాజీ పటేల్ ప్రవేశపెట్టిన సత్యసాయి వ్రతం షిర్డీలో పరిపాటైంది. అప్పటి నుంచి సాయిసత్యవ్రతం పరంపరగా వాడుకలోకి వచ్చింది. ఒక భక్త శిఖామణి ప్రవేశపెట్టిన ఈ సాయి వ్రతం వెనుక ఉన్న పూర్వాపరాలను విశిదపరిచే ప్రయత్నం ఇది…

పూణె జిల్లాలోని జున్నార్ తాలూకాలో నారాయణ గాం అనే ఊరుంది. ఆ ఊరి పటేల్ – భీమాజీ. ఇతను సంపన్నుడు. పైగా దయాగుణం ఎక్కువ. ఎంతమంది అతిథులు వచ్చినా కాదనకుండా భోజనాలు పెట్టేవాడు. మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకునేవాడు. అలాంటి సద్గుణునికి కర్మయెక్క పర్యవసానంగా కఫక్షయ రోగం పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో బాధపడేవాడు. నోటి నుంచి రక్తం గడ్డలుగా పడుతుండేది. బాధ తట్టుకోలేక ఎందుకో నానాసాహేబు కు ఉత్తరం రాయాలనిపించింది. నానా ఏదైనా సహాయం చేయగలడేమోనన్న ఆశతో ఉత్తరం రాశాడు భీమాజీ. అటు నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. `వెంటనే షిర్డీకి వెళ్లు, సాయిబాబావారి పాదాలను ఆశ్రయించు. ఇదొక్కటే తరుణోపాయం. వారి దర్శనంతో మహారోగాలే మాయమవుతాయి. ఏమాత్రం సందేహపడకుండా బాబావారి పాదాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్న నిర్భయుల్ని చేయగలరు’ అంటూ నానా సాహేబు సలహా ఇచ్చారు.

ఈ సలహా మేరకు భీమాజీ షిర్డీ వెళ్ళాడు. అతను లేచి నడిచేస్థితిలో లేడు. బండి మసీదు పక్కన వరకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకువచ్చారు. నానా సాహేబు, మాధవరావు ఆ పక్కనే ఉన్నారు. బాబావారు ఈ పటేలు పరిస్థితి గమనించారు. `ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకువచ్చి నా మీద పడేశారు. ఇదేమైనా మంచి పనేనా!’ అనగానే, భీమాజీ కాస్తంత బిత్తరపోయి, తిరిగి ధైర్యం తెచ్చుకుని, `బాబా, మీరు తప్ప నన్ను మరెవ్వరూ రక్షించలేరం’టూ వేడుకున్నాడు. ఆ వెంటనే బాబావారు భీమాజీకి ధైర్యం చెప్పి, నిశ్చింతగా వెళ్లి భీమా బాయి ఇంట్లో ఉండమని అనుజ్ఞ ఇచ్చారు. బాబా విభూతిని తెప్పించి కొంచం భీమాజీ చేతిలో ఉంచి, కొద్దిగా అతని నుదుట రాసి అతని శిరసుపై తమ హస్తం ఉంచారు. తర్వాత బసకు చేరుకోమని అనుజ్ఞ ఇచ్చారు. బబావారి ఆశీస్సులతో భీమాజీకి హుషారు వచ్చినట్లయింది. అంతకుముందు నడవలేని స్థితిలో ఉన్న భీమాజీ, హుషారుగా బండి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు.

బసలో ఆ రాత్రి పడుకున్నప్పుడు అతగాడికి ఓ కల వచ్చింది. అది అతని బాల్యంనాటి సంఘటనను పోలిఉంది. చిన్నతనంలో తనకు చదువుచెప్పిన మాస్టారు కనిపించి, పద్యం సరిగా కంఠస్తం చేయలేదంటూ బెత్తంతో వీపు చితకబాదాడు. ఆ తర్వాత మరో కల వచ్చింది. ఈ కలలో ఎవరో ఒక గృహస్థుడు వచ్చి భీమాజీ ఛాతీమీద కుర్చున్నాడు. అక్కడితో ఆగలేదు. చేతిలో పొత్రం (పప్పు రుబ్బడానికి ఉపయోగిస్తారు) తీసుకుని భీమాజీ ఛాతీపై గట్టిగా రుద్దడం ప్రారంభించాడు. ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది భీమాజీకి. కల అయ్యాక బాగా నిద్రపట్టేసింది. ఉదయం లేచేసరికి ఎన్నడూ లేనంత హుషారు పుట్టుకొచ్చింది. తాను వ్యాధిగ్రస్థుడినన్న విషయం మరచిపోయాడు. పరుగుపరుగున బాబా దర్శనానికి బయలుదేరాడు. బాబాను దర్శనం చేసుకుంటూ వారి లీలలను కొనియాడాడు. బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడే నెలరోజులపాటు ఉండిపోయాడు. అప్పుడే సత్యనారాయణస్వామివారి వ్రతంలాగానే సాయివ్రతం చేయడం ప్రారంభించాడు.

దాసగణు అప్పటికే రచించిన అర్వాచీన భక్తలీలామృతం లోని సాయి చరిత్రను ప్రేమపూర్వకంగా భీమాజీ చదివేవాడు. దాసగణు రాసిన ఈ గ్రంథంలో 45 అధ్యాయాలు ఉండగా, మూడు అధ్యాయాల్లో సాయినాథుని గురించి ఉంది. ఈ మూడే సాయిసత్యవ్రత కథలుగా భీమాజీ చదివేవాడు. అలా అతను అపరిమితమైన సౌఖ్యం పొందేవాడు. పూజాపద్ధతి, నైవేద్యం అంతా సత్యనారాయణ వ్రతంలాగానే ఆచరించేవాడు. ఈ రెండు వ్రతాల మధ్య తేడా అనేదే కనిపించేది కాదు. ఆ నాటి నుంచి ప్రతి గురువారం సత్యసాయి వ్రతం చేసుకోవడం భక్తులకు పరిపాటైంది. దీని వల్ల భక్తులకు, సుఖసంతోషాలను శ్రీ సాయిబాబావారు ప్రసాదిస్తున్నారు.

(భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్ఛరితలోని 13వ అధ్యాయంలో భీమాజీ పటేల్ సత్యసాయి వ్రత ఆచరణ ప్రస్తావన ఉన్నది. ఓం సాయి నమోనమః)

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close