తరుణ్‌కి భలే ‘బకరా’ దొరికాడులే.!

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన తరుణ్‌ ‘నువ్వే కావాలి’తో హీరో అయిపోయి, ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో లవర్‌బోయ్‌గా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. తన ఫస్ట్‌ మూవీ పెద్ద హిట్‌ అయిపోవడంతో హీరోగా తన రేంజ్‌ పెరిగిపోయిందనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత తరుణ్‌ చేసిన సినిమా కొన్ని హిట్‌ అవ్వడంతో అందరు హీరోల కంటే కొంత ఎక్కువ మోతాదులోనే హెడ్‌ వెయిట్‌ పెరిగింది. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఆర్తీ అగర్వాల్‌తో లవ్‌ ఎఫైర్‌ నడపడం, అది సెటిల్‌మెంట్‌ కోసం ఇండస్ట్రీ పెద్దల వరకు వెళ్ళడంతో అప్పటివరకు లవర్‌బోయ్‌ అనిపించుకున్న తరుణ్‌కి బ్యాడ్‌ ఇమేజ్‌ వచ్చేసింది. హీరోగా బిజీగా వున్న టైమ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో తనే హీరో అనే భ్రమలో వుండేవాడు. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదన్న విషయం గ్రహించలేకపోయాడు. ఆ భ్రమలో వుండగానే తనతో సినిమాలు తియ్యాలనుకునే నిర్మాతల క్యూ తగ్గింది. కొన్ని సందర్భాల్లో మీడియాపై కూడా నోరు పారేసుకోవడంతో పైకి వెళ్తున్న అతని కెరీర్‌ గ్రాఫ్‌ కాస్తా పడిపోయింది. అడపా దడపా తరుణ్‌తో సినిమాలు తియ్యడానికి ముందుకొచ్చే నిర్మాతలు ఇప్పుడు అది కూడా చెయ్యడం లేదు. అతను మేకప్‌ వేసుకొని చాలా కాలమైంది. తరుణ్‌తో సినిమా తీసేందుకు తెలుగులో నిర్మాతలు ముందుకు రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు కర్ణాటక నుంచి ఒక ఎస్‌.వి.ప్రకాష్‌ అనే ప్రొడ్యూసర్‌ దిగుమతి అయ్యాడు. ‘ఇది నా లవ్‌స్టోరీ’తో రమేష్‌గోపి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జనవరి 8 తరుణ్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేశారు. తెలుగులో కొత్త ప్రొడ్యూసర్‌ కావడంతో ఈ సినిమా కోసం నిర్మాత చాలా భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలిసింది. తరుణ్‌తో సినిమాలు తీసేందుకు ఏ నిర్మాతా ముందుకు రాని టైమ్‌లో ఎస్‌.వి.ప్రకాష్‌.. తరుణ్‌కి బకరాలా భలే దొరికాడు కదూ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close