జూ.ఎన్టీఆర్ విషయంలో మరీ అంత అభద్రతాభావానికి గురవడం దేనికో?

నందమూరి బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ మధ్య అర్ధం పర్ధంలేని వారసత్వ పోరాటం ఏమిటో..ఎందుకో తెలియదు. మొన్న ఒక సినిమా కార్యక్రమంలో నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ తన కొడుకు జూ. ఎన్టీఆరే తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అసలు సిసలయిన వారసుడు అని ఎందుకు..ఏ ఉద్దేశ్యంతో చెప్పారో తెలియదు గానీ అప్పటి నుండే ఈ వారసత్వ పోరాటం మొదలయిందని చెప్పవచ్చును.

నిజానికి జూ. ఎన్టీఆర్ కి రాజకీయాలలో చేరి తెదేపాలో చక్రం తిప్పాలనే కోరిక ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. అలాగే సినీ పరిశ్రమలో తన బాబాయ్ బాలకృష్ణతో పోటీ పడాలని ఎన్నడూ అనుకోలేదు. తాతగారు స్థాపించిన పార్టీ అనే అభిమానంతోనే జూ. ఎన్టీఆర్ తెదేపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహుశః అదే జూ. ఎన్టీఆర్ సినీ జీవితానికి కూడా చాలా నష్టం కలిగించిందని చెప్పవచ్చును.

అంతవరకు కేవలం సినిమాలు చేసుకొంటూ హ్యాపీగా బ్రతికేస్తున్న జూ. ఎన్టీఆర్, 2009 సార్వత్రిక ఎన్నికలలో తెదేపా తరపున విస్తృతంగా ప్రచారం చేసినపుడు ప్రజల నుండి చాలా అద్భుతమయిన స్పందన వచ్చింది. ఆయన కాకీ డ్రెస్ వేసుకొని అచ్చం తన తాతగారిలాగే అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా చేసిన ప్రసంగాలను చూసి ప్రజలు, రాజకీయ వర్గాలలో వారు కూడా ఆయన ఏదో ఒకనాడు తెదేపాలో కీలక పదవి స్వంతం చేసుకొని రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతారని భావించారు. ఆ జనాభిప్రాయమే జూ. ఎన్టీఆర్ కొంప ముంచిందని చెప్పవచ్చును.

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికయినా తన కొడుకు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా ప్రజల ముందుకు తీసుకురావాలనుకొంటుంటే, అకస్మాత్తుగా జూ. ఎన్టీఆర్ రంగప్రవేశం చేసినట్లవడంతో ఉలిక్కిపడ్డారు. దానితో వెంటనే అప్రమత్తమయిన చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణని ముందుకు తీసుకువచ్చి మెల్లగా జూ. ఎన్టీఆర్ ని పార్టీ నుండి దూరం చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అదృష్టమో లేక జూ. ఎన్టీఆర్ దురదృష్టమో తెలియదు కానీ సరిగ్గా అదే సమయంలో జూ. ఎన్టీఆర్ స్నేహితుడు కొడాలి నాని వైకాపాలోకి మారి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం, అదే సమయంలో జూ. ఎన్టీఆర్, స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు వేసి వైకాపా చిచ్చుపెట్టడంతో తెదేపా నుండి జూ. ఎన్టీఆర్ ని బయటకు గెంటేసేందుకు మంచి అవకాశం దక్కింది. మధ్యలో హరికృష్ణ ఓవర్ యాక్షన్ చేసి ఈ నాటకీయ పరిణామాలను మరింత రక్తి కట్టించడంతో జూ. ఎన్టీఆర్ తెదేపాకు పూర్తిగా బంధాలు తెగిపోయాయి.

ఆ ప్రభావం జూ.ఎన్టీఆర్ సినిమాలపై కూడా కనిపించడం మొదలయింది. నందమూరి అభిమానులు బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ ల మధ్య విడిపోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా సంక్రాంతి పండుగకి విడుదలవుతున్న సమయంలోనే జూ. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా విడుదలవడం చాలా యాదృచ్చికమే. సరిగా ఇదే సమయంలో మళ్ళీ హరికృష్ణ “వారసత్వ ప్రకటన” చేయడంతో హరికృష్ణ, జూ. ఎన్టీఆర్ ఇరువురూ కలిసి తమను సవాలు చేస్తున్నట్లుగానే బాలకృష్ణ భావిస్తున్నట్లున్నారు. అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన డిక్టేటర్ ఆడియో సక్సస్ కార్యక్రమంలో మాట్లాడుతూ “నా సినిమాలే నాకు పోటి అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు.. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా సినిమా వారసుడు నా కొడుకే.. అతనే నా సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేస్తాడు,” అని ప్రకటించారు.

యాదృచ్చికంగా జూ. ఎన్టీఆర్ కూడా ఇదే సమయంలో ‘నాన్నకు ప్రేమతో సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ “పౌరాణిక సినిమాలలో నటించాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ పౌరాణికాలు అనగానే అందరూ నన్ను తాతగారితో పోల్చి చూస్తుంటారు. పౌరాణికాలలో ఆయన స్థాయిని నేను ఎన్నటికీ చేరుకోలేను. నేనే కాదు ఎవరూ చేరుకోలేరు. ఆ విషయంలో ఆయనకు ఆయనే సాటి. అంత గొప్పగా నటించి మెప్పించ గల నటుడు మళ్ళీ జన్మించరు. నేను ఆయన వారసుడిని కాదు… ఆయన మనవడిని మాత్రమే అని చెప్పుకుంటా. ఈ జన్మకిది చాలు.’’ అని చెప్పారు.

ఈ రాజకీయాలు, సినిమాలు, రెండు వర్గాల మధ్య జరుగుతున్న వాదోపవాదాలను గమనించినట్లయితే రెండు ప్రధాన ప్రశ్నలు కనిపిస్తున్నాయి. 1. సినిమాలలో నందమూరి వారసుడు ఎవరు? 2. రాజకీయాలలో ఆయన వారసుడు ఎవరు?

సినిమాలలో ఆయన వారసత్వం గురించి పోరాడుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది జనాలే చెప్పాలి తప్ప బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ లు కాదు. ఎవరి సినిమాలు బాగుంటే వాటినే ప్రజలు ఆదరిస్తారు తప్ప నందమూరి వారసులో లేక మరొకరి వారసులో అయినంత మాత్రాన్న ఆదరించరని వారికీ తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఇరువురికీ తమదయిన ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. కనుక ఈ సినీ వారసత్వం గురించి అర్ధం పర్ధం లేని పోరాటాలు చేసుకోవడం వలన చివరికి వారే నవ్వులపాలవుతారు. నష్టపోతారు.

ఇక జూ.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించాలనే ఆత్రుత ఎన్నడూ ప్రదర్శించలేదు. అలాగే ఇది రాజకీయాలలో చేరేందుకు తగిన సమయం కూడా కాదు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలలో చేరినప్పటికీ, నేటికీ సినిమాలు విడిచిపెట్టాలనుకోవడం లేదు! అటువంటప్పుడు జూ.ఎన్టీఆర్ ఉచ్చస్థితిలో ఉన్న తన సినీ కెరీర్ ని విడిచి రాజకీయాలలో చేరుతారని అనుకోవడం అది చూసి చంద్రబాబు నాయుడు తదితరులు బెంబేలు ఎత్తిపోయి జూ.ఎన్టీఆర్ ని పార్టీ నుండి దూరం చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజానికి అటువంటి వ్యక్తి దొరకడం తెదేపా ఒక గొప్ప వరంగా భావించాలి. ఆయన సేవలు పార్టీకి ఉపయోగించుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకొంటూ అదే సమయంలో ఆయన సినీ జీవితంలో పైకి ఎదగడానికి తెదేపా సహకారం అందించి ఉండి ఉంటే ‘విన్ అండ విన్’ అన్నట్లుగా ఉండేది.

కానీ జూ.ఎన్టీఆర్ తన కొడుకు నారా లోకేష్ కి ఎక్కడ పోటీగా తయారవుతారో అనే ఊహాజనితమయిన భయంతో అతనిని అనవసరంగా దూరం చేసుకోవడమే కాకుండా ఆ దూరాన్ని అలాగే నిలిపి ఉంచడానికి అతనితో శత్రుత్వం కూడా కొనసాగిస్తున్నారు. దాని వలన ఇరువురూ కూడా నష్టపోతున్నారు. కానీ ఒకవేళ జూ.ఎన్టీఆర్ నిజంగానే తెదేపా పగ్గాలు చేతబట్టాలని ప్రయత్నించి ఉండి ఉంటే, అప్పుడు నారా లోకేష్ కూడా అతనితో పోటీపడి పార్టీ పగ్గాలు చేపట్టడానికి అన్ని విధాల జూ.ఎన్టీఆర్ కంటే తానే అర్హుడునని నిరూపించుకొని ఉంటే దాని వలన ఆయనకీ గౌరవంగా ఉండేది. పార్టీ కూడా బలపడి ఉండేది.

చివరిగా రెండు ప్రశ్నలు:

1. తెలంగాణాలో తెదేపాను పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తూ తనని జైలుకి పంపించాలని ప్రయత్నించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నేహం చేయగలిగినపుడు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీకి సేవ చేయడానికి సిద్దంగా ఉన్న జూ.ఎన్టీఆర్ ని ఎందుకు ఆదరించలేకపోతున్నారు?

2. తెలంగాణాలో కేసీఆర్ తనకు ఇతర పార్టీలు పోటీ ఉండకూడదని భావించడాన్ని నియంతృత్వంగా అభివర్ణిస్తున్న తెదేపా, జూ. ఎన్టీఆర్ విషయంలో ప్రదర్శిస్తున్న వైఖరి నియంతృత్వం కాదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close