జ‌న‌సేన‌కు కూడా ‘జ్యోతి’ పొత్తోప‌దేశం..!

‘పొత్తుల గురించి ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మాట్లాడ‌టం మాకు ఆన‌వాయితీ, ఈలోపు చ‌ర్చించం’ అని టీడీపీ నేత‌లు చెబుతుంటారు. ఆలోపుగా ఇత‌ర పార్టీల‌ను సంసిద్ధం చేసే బాధ్య‌త ‘ఆంధ్ర‌జ్యోతి’ తీసుకుందేమో అనిపిస్తోంది! కొద్దిరోజుల కింద‌ట‌.. ఏపీలో అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంచాల్సిన అవ‌స‌రాన్ని భాజ‌పాకి ‘కొత్త ప‌లుకు’ ద్వారా ఉద్బోధించారు. సంఖ్య పెంచితే.. పొత్తులో భాగంగా భాజ‌పాకి ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌నీ, ఆ విధంగా భాజ‌పా ఏపీలో బ‌ల‌ప‌డుతుంద‌నే విశ్లేష‌ణ ఇచ్చారు. ఇక‌, ఈ వారం జ‌న‌సేన పార్టీకి ‘పొత్తోప‌దేశం’ చేస్తున్నారు. అంతేకాదు, టీడీపీకి భాజ‌పాకి మ‌ధ్య దూరం పెరుగుతోంద‌న్న‌ట్టుగా అభిప్రాయ‌ప‌డ‌టం విశేషం. దీనికి నేప‌థ్యంగా గ‌త కొన్ని రోజులుగా పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌య‌మై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను ఉటంకించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్ర సాయం ఇప్పుడు ఆశిస్తున్న స్థాయిలో లేక‌పోతే… ఆ ప్ర‌భావం టీడీపీ – బీజేపీల పొత్తుల మీద ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క్రేజ్ పై దేశవ్యాప్తంగా మ‌బ్బులు క‌మ్ముకున్న‌ట్టు కూడా చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాల‌నేది కూడా తెగేసి చెప్పేశారు. క‌ల‌సిరాని భాజ‌పాకి జ‌న‌సేన విడాకులు ఇచ్చేసి, టీడీపీకి చేరువ‌య్యే ప‌రిస్థితులు వారికి క‌నిపిస్తున్నాయ‌ట‌! ఎలాగూ, ప్ర‌త్యేక హోదా విషయమై భాజపా అభీష్టానికి వ్యతిరేకంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుగుబావుటా ఎగ‌రేశారు కాబ‌ట్టీ, జ‌న‌సేనతో క‌మ‌ల‌నాథులు చేతులు క‌లిపే ప‌రిస్థితి లేద‌ని పేర్కొన్నారు. ఇక‌, ఏపీలో మిగిలింది.. ప్ర‌తిప‌క్ష పార్టీ వైయ‌స్సార్ సీపీ. జ‌గ‌న్ పై ఉన్న అవినీతి కేసులు, ప్ర‌తీవారం విచార‌ణ‌కు కోర్టుకు హాజరౌతుండ‌టం.. ఈ నేప‌థ్యంలో వైకాపాతో జ‌న‌సేన జ‌త‌క‌డితే ప‌వ‌న్ ఇమేజ్ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌నీ వారే రాసేశారు. పోనీ, ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాజ‌పా, టీడీపీలు తెగ‌తెంపులు చేసుకుంటున్నాయ‌ని కూడా తెగేసి చెప్ప‌లేదు. భాజపాతో పొత్తు విషయమై టీడీపీ ఆలోచన ఏంటనేది కూడా గోడ మీది పిల్లివాటంగానే చెప్పారు. ‘ఎవ‌రికి ఎప్పుడు ఏది ప్ర‌యోజ‌నం అనుకుంటే అదే చేస్తారు’ అంటూ ఓ వాక్యం రాసేసి ఎస్కేప్ అయిపోయారు.

సో… జ‌న‌సేన‌కు టీడీపీతో పొత్తు వినా వేరే మార్గం లేద‌న్న‌ట్టుగా చెప్పారు. అయితే, ఇక్క‌డ అస‌లు విష‌యాన్ని ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం! అదేంటంటే… రాష్ట్రంలో అన్ని నియోజ‌క వ‌ర్గాల నుంచి పోటీకి దిగాల‌నే ఉద్దేశంతోనే జ‌న‌సేన ఉంది. సాధ్యాసాధ్యాల‌పై వ‌చ్చే ఏడాది చివ‌రిలో విశ్లేషించుకుంటామ‌ని కూడా ఆ మ‌ధ్య జ‌న‌సేనాని చెప్పారు. ఇవేవీ ఈ విశ్లేషణలో పరిగణనలోకి రాలేదు. ‘ఆంధ్ర‌జ్యోతి’ రాత‌లు ఎలా ఉన్నాయంటే… ఇత‌రుల‌తో పొత్తు లేకుండా జ‌న‌సేన పోటీకి దిగ‌లేద‌ని వీరే డిసైడ్ చేసేస్తున్నారు. ఆ పొత్తు కూడా టీడీపీతోనే పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌నీ వీరే డిసైడ్ చేసేస్తున్నారు. భాజ‌పా టీడీపీల మ‌ధ్య పొత్తు విష‌యానికి వచ్చేసరికి ‘ఎవ‌రికి ఎప్పుడు ఏది ప్ర‌యోజ‌నం అనుకుంటే అదే చేస్తారు’అని వారే రాశారు. ఇదే సూత్రం జ‌న‌సేన‌కు కూడా వ‌ర్తిస్తుంది క‌దా! టీడీపీతో క‌లిసి వెళ్లాలా, భాజ‌పాతో పొత్తు పెట్టుకోవాలా, వైకాపాకి మ‌ద్ద‌తు ఇవ్వాలా అనేది జ‌న‌సేన నిర్ణ‌యించుకుంటుంది. ‘వారికి అప్పుడు ఏది ప్ర‌యోజ‌నం అనుకుంటే అదే చేస్తారు’.. సేమ్ థియ‌రీ! పొత్తు విష‌యంలో టీడీపీ నిర్ణ‌యం ‘ఇదీ’ అని నిక్కచ్చీగా చెప్ప‌లేన‌ప్పుడు… జ‌న‌సేన ‘అటే’ వెళ్లాలీ అని ఎలా నిర్దేశిస్తారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close