విజయవాడ టిడిపిలో నిత్య పోటీ

అధినేతను మెప్పించడం కోసం అతిగా కీర్తించడం, అవతలివారిపై దాడి చేయడం టిడిపి నేతల నిత్య కృత్యాలుగా మారాయి. విభజన తర్వాత తెలంగాణలో బాగా వెనకపట్టు పట్టి విజయవాడ వీటికి కేంద్రంగా మారినట్టు కనిపిస్తుంది. రాజధాని రాజకీయ క్రీడలో ఎక్కడ వెనకబడిపోతామోనని దాదాపు అరడజను మంది నాయకులు అహౌరాత్రాలు పెనుగులాడుతున్నారట. బోండా ఉమామహేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్‌, వంశీ, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకరరావు వంటివారికి ఈ పెనుగులాటే సరిపోతున్నది.వీరందరి వీరోచిత విన్యాసాలలో ఒకోసారి ఒక్కొక్కరు బాగా స్కోరు చేశారనిపించుకోవడం, అంతలోనే ర్యాంకులు మారడం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. అవకాశం లేదా వివాదం వస్తే చాలు రంగంలోకి దిగిపోయి రాజకీయ దాడి చేయడమే వీరి ఫార్ములాగా మారింది. పాలక పక్షం ఇరకాటంలో వుంటే వీరి దాడి ఇంకా తీవ్రంగా వుంటుంది. గద్దె రామమోహనరావు మాత్రం ఈ పోటీలో అంతగా పాల్గొనరు. కేశినేని నానిది మరో స్టైల్‌. కొంతమంది గుంటూరు నేతలను కూడా ఈ జాబితాకు కలపాల్సి వుంటుంది. మంత్రులుగా వున్నా దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు కూడా ఈ రేసులో శక్తికొద్ది పాల్గొంటున్నారు. వీరంతా దశలవారిగా తిట్టిపోశాక అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు పెదవి విప్పుతారు. లేదంటే మీడియాలో తన వ్యాఖ్యలు వచ్చేలా చూసుకుంటారు. ఇంతలో మరో సమస్య మరో సంవాదం,, మరో సంఘర్షణ.. పైకి జరిగే సంఘర్షణ కంటే లోలోపల పార్టీలో జరిగేది మరింత తీవ్రంగా వుంటున్నట్టు వాపోతున్నారు. తప్పో ఒప్పో.. తప్పదు కదా…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close