హైకోర్టు విభ‌జ‌న ఆల‌స్యానికి చంద్ర‌బాబు స‌ర్కారు కార‌ణ‌మా..?

తెలంగాణ ఏర్పాటు త‌రువాత అప‌రిష్కృతంగా ఉన్న అంశాల్లో కీల‌క‌మైంది హైకోర్టు విభ‌జ‌న‌. ఎప్ప‌టిక‌ప్పుడు ఇదే అంశాన్ని కేసీఆర్ స‌ర్కారు తెర‌మీదికి తెస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశ‌మై లోక్ స‌భ‌లో తెరాస ఎంపీలు తీవ్ర స్వ‌రం వినిపించారు. ప్ర‌త్యేక హైకోర్టు కావాలంటూ స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లి నిన‌దించారు. రాష్ట్రం ఏర్ప‌డి మూడున్న‌రేళ్లు అవుతున్నా ఇంకా హైకోర్టు విభ‌జ‌న కాలేద‌నీ, దీంతో న్యాయ‌వాదులు ఆందోళ‌న చేస్తున్నార‌నీ, వారి ప‌దోన్న‌తులు వంటి అంశాల‌తోపాటు, కేసుల ప‌రిష్క‌ర‌ణ‌లో కూడా కొంత ఆలస్యం జ‌రుగుతోంద‌ని ఎంపీ జితేంద‌ర్ అన్నారు. అయితే, దీనిపై ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంటోంది. తెరాస ఎంపీల వాద‌న ఇలా ఉంటే… తెలంగాణ భాజ‌పా నేత‌ల స్పంద‌న మ‌రోలా ఉంది.

హైకోర్టు విభ‌జ‌న అనేది కేంద్రం ప‌రిధిలో లేని అంశ‌మ‌నీ, దీనిపై భాజ‌పా స‌ర్కారుకు ఎలాంటి అభ్యంత‌రాలూ లేవ‌ని, ఇది సుప్రీం కోర్టు ప‌రిధిలోని అంశ‌మంటూ భాజ‌పా నేత కిష‌న్ రెడ్డి అంటున్నారు. కోర్టు విభ‌జ‌నకు తాము కూడా ప్ర‌య‌త్నిస్తున్నామ‌నీ, సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ‌లు రాశామ‌ని చెప్పారు. హైకోర్టు ఏర్పాటుకు ఆంధ్రా ప్ర‌భుత్వం నుంచి జాప్యం జ‌రుగుతోంద‌నీ, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు. అంటే, ఏపీ తీరు వ‌ల్ల‌నే కోర్టు విభ‌జ‌న ఆల‌స్యం అవుతోంద‌ని మ‌రోసారి చెప్పారు. నిజానికి, ఆ మ‌ధ్య తెరాస నుంచి కూడా ఇలాంటి అభిప్రాయాలే కొన్ని వెలువ‌డ్డాయి.

ఇక‌, ఆంధ్రా త‌ర‌ఫు ప్ర‌య‌త్నాల విష‌యానికొస్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో మొద‌టి ద‌శ నిర్మాణాల్లో హైకోర్టు భ‌వ‌నం కూడా ఉంది. దానికి సంబంధించిన న‌మూనాల‌ను కూడా ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ఓకే చేశారు. అయితే, ఆ భ‌వ‌నం పూర్త‌య్యే వ‌ర‌కూ హైకోర్టు ఏర్పాటు జ‌ర‌గ‌దా అనే అనుమానం అవ‌స‌రం లేద‌నే సంకేతాలను కూడా ఏపీ స‌ర్కారు ఇస్తోంది. విజ‌య‌వాడ‌లో ఓ తాత్కాలిక భ‌వ‌నం కోసం అన్వేషిస్తున్నార‌నీ, ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని తీసుకెళ్లి, వారికి అనుకూల‌మైన భ‌వ‌నాన్ని చూపించి.. కోర్టును ఏర్పాటు చేయాల‌నే ఉద్దేశంలో ఉన్న‌ట్టు కొందరు చెబుతున్నారు. స‌రే, త‌మ‌వంతు క్రుషి జ‌రుగుతోంద‌నే అభిప్రాయం క‌ల్పించ‌డం కోసమే ఇలాంటి ప్ర‌య‌త్నాలు అనేవారూ లేక‌పోలేదు. ఒక‌వేళ తాత్కాలిక భ‌వ‌నంలోనే కోర్టు ఏర్పాటు చేయాల‌ని అనుకుంటే.. ఆ ప‌నేదో ముందే చెయ్యొచ్చు అనే చ‌ర్చ కూడా ఈ సంద‌ర్భంగా తెర‌మీదికి వ‌స్తుంది. అయితే, స్థూలంగా చూసుకుంటే.. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌లోపుగానే స‌మ‌యం ఉంది. ఈలోపుగా విభ‌జ‌న‌కు సంబంధించి కొంత ప్ర‌క్రియ మొద‌లైనా… రెండు రాష్ట్రాల‌కూ వేర్వేరు కోర్టులు పూర్తి స్థాయిలో ఏర్పాటు కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉందనేదే అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిన్నెల్లి అరెస్టు పేరుతో రోజంతా డ్రామా నడిపిన పోలీసులు !

ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో ధ్రిల్లర్ డ్రామాను నడపడంలో అద్భుతమైన విజయం సాధించారు. మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు. తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. తర్వాత అరెస్ట్ చేశామని...
video

నెత్తురుతో కత్తికి పదును పెట్టే భార‌తీయుడు

https://www.youtube.com/watch?v=lPP7svLGvFM క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ లో వచ్చిన ‘భార‌తీయుడు’ ఓ సంచలనం. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్. రెహమన్ ఇచ్చిన.. అదిరేటి డ్రస్సు , మాయా మచ్ఛీంద్ర ,...

నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం

నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఇకపై పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే....

రేవంత్ సన్మానం చేస్తే కేసీఆర్ వద్దంటారా ?

తెలంగాణ సాధనలో మీది ప్రముఖ పాత్ర... వచ్చేయండి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ చాలా మందిని పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close