19న చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమాకి క్లాప్‌

రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. మ‌రోవైపు బోయ‌పాటి శ్రీ‌ను సినిమాకి ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం కూడా కుదిరింది. జ‌న‌వ‌రి 19న ఈ సినిమాని లాంఛ‌నంగా మొద‌లెడ‌తారు. మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. క‌థానాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.కానీ ఎవ్వ‌రికీ ఖ‌రారు చేయ‌లేదు. ర‌కుల్ ప్రీత్ సింగ్ కే ఎక్కువ ఛాన్స్ ఉంద‌ని తెలుస్తుంది. భ‌ద్ర త‌ర‌వాత‌.. ద‌మ్ముని మిన‌హాయిస్తే బోయ‌పాటి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో చేసిన `జ‌య జాన‌కి నాయ‌క‌`కి ఆ స్థాయి ఓపెనింగ్స్ వ‌చ్చాయంటే దానికి కార‌ణం… బోయ‌పాటి స్టామినానే. ఈసారీ చ‌ర‌ణ్ కోసం ఓ మాస్‌, క‌మర్షియ‌ల్ క‌థ‌ని రాసుకున్నాడు బోయ‌పాటి. సినిమా మొత్తం అచ్చంగా బోయ‌పాటి శైలి త‌ప్ప‌క‌పోయినా.. క‌థ‌లో ఓ కొత్త పాయింట్ ఉంద‌ట‌. రాజ‌స్థాన్ నేప‌థ్యంలో సినిమా సాగ‌బోతోంద‌ని, షూటింగ్ అంతా అక్క‌డే జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close