ఇద్దరు ప్రభాకర్‌ల మధ్య పవన్‌

తన తొలి రాజకీయ యాత్రకు ముందు కరీం నగర్‌ జిల్లాలోని కొండగట్టు ఆంజన్నను సందర్శించాలని నిర్ణయించుకోవడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌ కొత్త తరహా చర్చకు కారణమైనారు. ఎపిలో కాకుండా తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన సెంటిమెంటల్‌ కారణాలు చెప్పారు.కాని టిఆర్‌ఎస్‌తో రహస్య అవగాహన వుండటం వల్లనే పవన్‌ ఇక్కడ ప్రవేశిస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. పవన్‌ తెలంగాణ వ్యతిరేకి అని కూడా వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్‌ ఈ ఆరోపణలను కొట్టి పారేయడానికి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. అంటే పవన్‌ను తమతో ముడిపెట్టే కథనాలను వెంటనే ఖండించడం అవసరమని భావించారన్నమాట. అయితే ఆయనను వ్యతిరేకిగా గాక జనాదరణ గల సినిమా నటుడుగానే అభివర్ణించారు.కొండగట్టు నుంచి ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. పవన్‌కు సంబంధించి ఇది మంచి పరిణామమే. అయితే ఆయన మద్య మధ్యలో వచ్చి పోయే నట నాయకుడని తన వల్ల లాభం నష్టం ఏమీ వుండవని కర్నె వ్యాఖ్యానించారు. అంతకంటే కీలకమేమంటే కెసిఆర్‌తో పవన్‌ కలిసింది అజ్ఞాతవాసి చిత్రం అయిదు షోల అనుమతి కోసమే తప్ప రాజకీయాలు కోసం కాదని వున్న మాట చెప్పేశారు.అయితే ఆయన కలిసినప్పుడు మాత్రం అధికార మీడియా బాగానే ప్రచారం చేసుకుంది. ఇతర విషయాలు కూడా వచ్చాయి. పవన్‌ కొన్ని కితాబులిచ్చారు కూడా. ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం సినిమా కోసమేనని అది కూడా కెసిఆర్‌ హామీ ఇవ్వకుండా సంబంధిత మంత్రి దగ్గరకు పంపించారని కర్నె చెబుతున్నారు. పవన్‌ కలిసింది ఆ చిత్రం కోసమేనని మీడియాలోనూ రాజకీయ పార్టీల్లోనూ చాలా మందికి తెలుసు గాని ఇలా చెప్పడం ఇబ్బందే. ఏదైతేనం ఇద్దరు ప్రభాకర్‌ల కారణంగా అసలు సంగతి బయిటకొచ్చిందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close