ఇక‌పై వారు కూడా మిత్ర ధ‌ర్మం పాటిస్తార‌ట‌..!

మిత్ర ధ‌ర్మం… తెలుగుదేశం, భాజ‌పాల మ‌ధ్య ఈ ధ‌ర్మ పాల‌న చ‌ర్చే ఈ మ‌ధ్య తెర‌మీదికి వచ్చింది. టీడీపీ, భాజ‌పా మిత్ర‌ప‌క్షాలు కాబ‌ట్టి, ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోకూడ‌దు.. ఇదే మిత్ర‌ధ‌ర్మం అంటే! అయితే, భాజ‌పా నేత‌లు ఈ మధ్య ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా… తాము సైలెంట్ గా ఉండ‌టానికి కార‌ణం ఈ ధ‌ర్మ పాల‌నే అని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఇటీవ‌ల చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కొంత ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశార‌నుకోండీ..! అయితే, ఇదే అంశంపై ఏపీ భాజ‌పా మంత్రి మాణిక్యాల‌రావు స్పందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాటిస్తున్న‌ట్టే తాము కూడా మిత్ర‌ ధ‌ర్మం పాటిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ నాయ‌కుల్ని విమ‌ర్శ‌లు చేయ‌కుండా అదుపు చేస్తామ‌ని మాణిక్యాల‌రావు మాటిచ్చారు! తెలుగుదేశం పార్టీతో ఇక‌పై ఎలాంటి విభేదాలు లేకుండా క‌లిసి ప‌నిచేస్తామ‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం..!

పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల కేటాయింపులు, ఏపీకి కేంద్రం చేస్తున్న సాయం, మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు… ఇలాంటి అంశాల‌పై ఈ మ‌ధ్య ఏపీ భాజ‌పా నేత‌లు స్వ‌రం పెంచిన సంగ‌తి తెలిసిందే. టీడీపీని ల‌క్ష్యంగా వారు చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీటిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించి… మిత్ర‌ధ‌ర్మం పాటిస్తున్నాం కాబ‌ట్టి మాట్లాడ‌టం లేద‌నీ, ఒక‌సారి పొత్తు వ‌ద్దునుకుంటే న‌మ‌స్కారం పెట్టేసి, ఆ త‌రువాత మాట్లాడుకుందాం అని కాస్త ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇది కొంత‌మంది ఏపీ భాజ‌పా నేత‌ల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్య‌మంత్రి వ్య‌క్తం చేసిన ఆగ్ర‌హంగా చెప్పుకోవ‌చ్చు. అంతేగానీ… ఏపీ భాజ‌పా నేత‌ల వ్యాఖ్య‌ల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల‌నో, లేదా రాష్ట్ర నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల్ని భాజ‌పా పెద్దల వైఖ‌రిగానో ఆయ‌న చూడ‌లేద‌ని కూడా స్పష్టంగానే ఉంది. చంద్ర‌బాబు ఇలా స్పందించేస‌రికి… మ‌రోసారి టీడీపీ, భాజ‌పా పొత్తు భ‌విష్య‌త్తులో ఎలా ఉండ‌బోతుందో అనే విశ్లేష‌ణ‌లు చాలా వ‌చ్చేశాయి.

అయితే, చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై మ‌రింత రాద్ధాంతం చేయ‌కుండా.. కొంత దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఏపీ భాజ‌పా ప్ర‌య‌త్నిస్తోంద‌ని అనిపిస్తోంది. ఏపీ భాజ‌పా నేత‌లు కూడా ఈ మిత్ర‌ధ‌ర్మం పేరుతో మొద‌లైన చ‌ర్చ‌కు ఇక్క‌డితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఉన్న‌ట్టు మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి.అంటే, ఇక‌పై పొత్తు పేరుతో లాభ‌న‌ష్టాల‌ను బేరీజు వేస్తుండే సోము వీర్రాజు విమ‌ర్శ‌లు ఉండ‌వ‌ని అనుకోవ‌చ్చా..? కేంద్ర కేటాయింపుల‌పై ఘనత తమకు దక్కనీయడం లేదంటూ చంద్రబాబుపై ఎప్ప‌టిక‌ప్పుడు విరుచుకుప‌డే పురందేశ్వ‌రి ఆగ్ర‌హాలు వినిపించ‌వ‌ని భావించొచ్చా..? మిత్ర ధ‌ర్మం అంటే అదే క‌దా! అది సాధ్య‌మేనా..? ఏం జ‌రుగుతుందో మ‌రి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close