కృష్ణగాడి వీర ప్రేమ గాధ ఓవర్సీస్ హక్కులు దక్కించుకొన్న పిక్సెల్ డ్రీమ్స్

‘భలే భలే మగాడివోయ్’ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత నాని “కృష్ణగాడి వీర ప్రేమ గాధ” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో మెహ్ రీన్ అనే కొత్త హీరోయిన్ జతకడుతోంది. మరో విశేషమేమిటంటే ‘పిక్సెల్ డ్రీమ్స్’ అని కొత్తగా స్థాపించబడిన ఓవర్ సీస్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా హక్కులను స్వంతం చేసుకొంది. ఈ సినిమాలో సంపత్, బ్రహ్మాజీ, పృధ్వీ, శత్రు, రాజేష్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి చంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ రహ్మాన్ శిష్యుడు విశాల్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇంతకు ముందు రోబో మరియు 1-నేనొక్కడినే సినిమాలకు విశాల్ సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసారు.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా ఆడియో ఈనెల 20వ తేదీన విడుదలవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి మొదటివారంలో విడుదలవుతుంది. విదేశాలలో ఈ సినిమా ప్రదర్శనకు ఆసక్తి గలవారు పిక్సెల్ డ్రీమ్స్ సంస్థను ఈ క్రింద ఫోన్ నెంబర్ లేదా ఈ మెయిల్ చిరునామాలో సంప్రదించవచ్చును.

పిక్సెల్ డ్రీమ్స్:
ఫోన్ నెంబర్లు: 2484256364/2402465388 (శ్రీనివాస్)
ఈ-మెయిల్: pixeldreamsusa@gmail.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close