పవన్ హీరోయిన్‌కి హిట్ వస్తుందా?

పవ‌న్‌క‌ల్యాణ్‌ ‘కొమరం పులి’ వచ్చి ఏడేళ్లు అవుతోంది. అందులో నటించిన నికిషా పటేల్‌ను ఇంకా పవన్ హీరోయిన్‌గా ప్రేక్షకులు గుర్తిస్తున్నారంటే ఇండస్ట్రీలో అమ్మాయిగారి పొజిషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘కొమరం పులి’తో కలిపి ఏడేళ్లలో నికిషా మూడంటే మూడు తెలుగు సినిమాల్లో నటించింది. ముచ్చటగా మూడూ బకెట్ తన్నేశాయి. కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో కూడా సేమ్ సిట్యువేషన్. ఎప్పటికప్పుడు నికిషా కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో ఏదో ఒక కొత్త సినిమాతో వార్తల్లోకి వస్తోంది. తాజాగా తెలుగులో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ ‘రౌడీ పోలీస్’ చేస్తున్నట్టు ఈ రోజు ప్రెస్ నోట్ వచ్చింది. డూప్ లేకుండా రిస్కీ యాక్షన్ షాట్స్ చేసినట్టు అందులో పేర్కొన్నారు. నికిషా కష్టాన్ని తక్కువ చేయడం లేదు గానీ అమ్మాయికి అసలు హిట్ వస్తుందా? లేదా? అనేది డౌట్ గా మారింది. ప్రేక్షకుల్లో నికిషాకు క్రేజ్ పూర్తిగా తగ్గిన మాట వాస్తవం. నిర్మాత పరిస్థితి చూస్తే జనాలకు జాలి కలుగుతోంది. సాధారణంగా ఇన్ని ఫ్లాపులు వచ్చిన హీరోయిన్‌కి ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం కష్టం. కానీ, అందంతో నికిషా నెట్టుకు వచ్చేస్తోంది. ఆమె తీరు చూస్తుంటే ఫ్లాపుల్లో నితిన్, సాయిధరమ్ తేజ్ రికార్డులు బ్రేక్ చేసేట్లుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close