దర్శకులకు దమ్ముంది! మరి హీరోలకు?

ముందు కొరటాల శివ, తర్వాత సతీష్ వేగేశ్న, వెనుక దేవి ప్రసాద్… తెలుగు దర్శకులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. రాజకీయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మూడ్రోజుల ముందు “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ చేసిన ప్రామిస్ గుర్తు చేసి, మనమంతా ఆయన్ను మనిషిని చేద్దాం” అని దర్శకుడు కొరటాల శివ ప్రధాని మోదీకి ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన విషయం విదితమే. అల్లరి నరేష్ హీరోగా ‘కెవ్వు కేక’, ఆర్యన్ రాజేష్ హీరోగా ‘లీలామహల్ సెంటర్’ తదితర సినిమాలు తీసిన దర్శకుడు దేవి ప్రసాద్ పెన్ గన్ నుంచి ‘మాట తప్పిన రాజకీయాలను అడుసులోకి తొక్కు… ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ స్లోగన్ వచ్చింది. ఇక, ‘శతమానం భవతి’ చిత్రదర్శకుడు సతీష్ వేగేశ్న ఫేస్‌బుక్‌లో ఆయన ఆవేశాన్ని అక్షరాలుగా మలిచి కవితాత్మకంగా రాశారు.

ఫేస్‌బుక్‌లో సతీష్ వేగేశ్న పోస్ట్:

తుపాకి గుండుకు గుండె ఎదురొడ్డిన
ఆంధ్రకేసరి ధైర్యానికి వారసులం…
తెల్లవాళ్లను మూడు చెరువుల నీళ్లు తాగించిన
అల్లూరి సీతారామరాజు పోరాటానికి వారసులం…
ఢిల్లీ పడగొడితే తొడకొట్టి నిలబడిన
తెలుగుజాతి ఆత్మగౌరవం నందమూరి తారకరామారావు వారసులం…
సహనంగా ఉన్నామని అలుసుగా చూడొద్దు.
ఓర్పుగా ఉన్నామని తేలికగా తీసేయొద్దు.
మాట తప్పడం మీకు చేతకావచ్చు…
మడమ తిప్పడం మాకు చేతకాదు.
ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన ఏ పార్టీ
బ్రతికి బట్టకట్టదు, మేం కట్టనివ్వం.
సిద్ధంగా ఉండండి
చాలా రుచి చూపిస్తాం తట్టుకోలేనంతగా!

సినిమాల్లో హీరోల కోసం పంచ్ డైలాగులు రాయడం, వెండితెర మీద మాటల తూటాలు పేల్చడం మాత్రమే కాదు. అవసరమైతే తమను ఆదరిస్తున్న ప్రజల కోసం గొంతు వినిపించే దమ్ముందని దర్శకులు ప్రూవ్ చేసుకున్నారు. అదే సినిమాల్లో ప్రజల పక్షాన పోరాడే నాయకులుగా, మహోన్నత ఆశయాలు కలిగిన మంచి మనుషులుగా కనిపించే హీరోలకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం మాట్లాడడానికి నోరు రావడం లేదు. సోషల్ మీడియాలో ట్వీట్ లేదా పోస్ట్ చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ” తమిళనాడులో జల్లికట్టు సమస్య గురించి స్పందించిన వీరికి… ఐదు కోట్ల ఆంధ్రుల అభిలాష అర్థం కావడం లేదా?” – హీరోలకు, ఇండస్ట్రీ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఈ ఒక్క ప్రశ్నే ఎదురవుతోంది. ఏం సమాధానం చెబుతారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోంమంత్రి అనిత … వనితలా కాదు !

ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా...

జగన్ అహానికి ప్రజల పరిహారం పోలవరం !

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి...

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close