అభిమానుల గోల‌.. అలిగిన ప్ర‌కాష్‌రాజ్‌

స్టార్ హీరో ఆడియో ఫంక్ష‌న్ అంటే అభిమానులు చేసే గోల అంతా ఇంతా కాదు. వేదిక‌పై త‌మ హీరో రావాల‌ని, ఆయ‌నే మాట్లాడాల‌ని ప‌ట్టుబ‌ట్టి కూర్చుంటారు. కేక‌లు వుస్తుంటారు. సాధార‌ణంగా ఇలాంటి సిత్రాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆడియో ఫంక్ష‌న్లో క‌నిపిస్తుంటాయి. `భ‌ర‌త్ అనే నేను` లో కూడా ఈ దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి మ‌హేష్ తో పాటు, ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వ్వ‌డంతో ఆ కేరింత‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. ప్ర‌కాష్‌రాజ్ వేదికపై మాట్లాడుతున్న‌ప్పుడు అభిమానుంతా `పాద‌ర్‌.. ఫాద‌ర్‌` అంటూ అరిచారు. `ఏంట్రా మీ గోల‌` అంటూ కాసేపు స‌ర‌దాగానే తీసుకున్న ప్ర‌కాష్ రాజ్‌కి ఆ త‌ర‌వాత ప‌రిస్థితి అర్థ‌మైంది. ఇక త‌న‌ని మాట్లాడ‌నివ్వ‌ర‌ని తెలుసుకుని, వేదిక నుంచి.. వ‌డివిడిగా కింద‌కు వ‌చ్చేశారు. యాంక‌ర్ సుమ వారిస్తున్నా వినిపించుకోకుండా ప్ర‌కాష్ రాజ్ కింద‌కు వ‌చ్చేసి, అట్నుంచి అటే బ‌య‌ట‌కు వెళ్లి పోయారు. ఈ త‌తంగం అంతా మ‌హేష్‌, ఎన్టీఆర్‌లు ఆశ్చ‌ర్యంగా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి బ‌హిరంగ స‌భ‌ల్లో, ఇంత మంది జ‌న సందోహం వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటివి మామూలే. ప్ర‌కాష్ రాజే లైట్ తీసుకుని ఉంటే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close