ఫిల్మ్ ఛాంబ‌ర్ లో జ‌రిగిన అస‌లు క‌థ ఇదా..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈరోజు హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కూ ఆయ‌న ఛాంబ‌ర్ లోనే ఉన్నారు. మ‌ద్ద‌తుగా మెగా ఫ్యామిలీ అంతా వ‌చ్చింది. త‌న త‌ల్లిని దూషించిన వ్య‌వ‌హారంపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ, న్యాయ‌ప‌రంగా పోరాటం చేయాల‌ని మెగా ఫ్యామిలీ సమాలోచ‌న‌లు జ‌రిపింది. కొంత‌మంది న్యాయ‌వాదులతో చ‌ర్చించారు కూడా! అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబ‌ర్ ద‌గ్గ‌రకి వ‌స్తుండ‌టంతో వారిని అదుపు చేయ‌డం పోలీసుల‌కు కాస్త ఇబ్బందిగా మారింది. ఆ త‌రువాత‌, ఫిల్మ్ ఛాంబ‌ర్ నుంచి ప‌వ‌న్ బ‌య‌ట‌కి వెళ్లిపోయారు. ప్రెస్ మీట్ నిర్వ‌హిస్తార‌ని అనుకుంటే అది కూడా లేదు!

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ లోప‌ల జ‌రిగిన వ్య‌వ‌హారం ఏంటంటే… త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌నీ, చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఒక ఫిర్యాదు ప‌త్రాన్ని ప‌వ‌న్ నింపార‌ట‌! మంత్రి నారా లోకేష్ తోపాటు టీవీ 9 ర‌విప్ర‌కాష్‌, శ్రీ‌నిరాజు, ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌… ఇలా కొంత‌మంది త‌న‌పై కుట్ర చేస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నారు క‌దా! స‌రే, దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉన్నాయా అని అడిగితే… ప‌వ‌న్ నుంచి స‌మాధానం లేద‌ట‌! అక్క‌డ ప‌నిచేస్తున్న‌వారు కొంత‌మంది చెబితే విన్నాన‌ని ప‌వ‌న్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అంత‌కుమించి త‌న ద‌గ్గ‌ర ఆధారాలంటూ ఏవీ లేన‌ట్టుగా ప‌వ‌న్ స్పందించార‌ని స‌మాచారం. అంతే.. అక్క‌డితో ఫుల్ స్టాప్ పెట్టి, రేపు వ‌స్తాన‌ని చెప్పి ప‌వ‌న్ బ‌య‌లుదేరి వెళ్లిపోయార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలి గురించి ఇంత‌కుముందు క‌థ‌నాల్లో చ‌ర్చించుకున్నాం! ఆయ‌న‌కి ఎవ‌రో ఏదో చెబితే చాలు… వెంట‌నే స్పందించేసి బ‌య‌లుదేరేస్తారు. గ‌తంలో మంత్రి నారా లోకేష్ పై అవినీతి ఆరోప‌ణ‌ల‌పై కూడా ఇలానే చెప్పారు క‌దా! నిజానికి, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ల్లిని వివాదంలోకి లాగిన సంద‌ర్భంలో మీడియా కూడా ప‌వ‌న్ కి మ‌ద్ద‌తుగా నిలిచింది. శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల్ని అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. కానీ, ఆ అంశంపై వేరే కోణం నుంచి ప‌వ‌న్ రియాక్ట్ అయ్యారు. దానికి రాజ‌కీయ కోణం జోడించి, దానికి మీడియాలో ఒక వ‌ర్గం కుట్ర చేస్తోంద‌న్న వాద‌న‌ ద‌ట్టించి పోరాటమంటూ ఛాంబ‌ర్ కి బ‌య‌లుదేరేశారు. దీక్ష చేస్తార‌న్నారు! కానీ, వీట‌న్నింటికంటే ముందు తాను చేయ‌బోతున్న పోరాటానికి సంబంధించిన ప్రాథ‌మిక ఆధారాలు ఉండాల‌నే విష‌యాన్ని ప‌వ‌న్ ప్ర‌తీసారీ మ‌ర‌చిపోతున్నారు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని...

సజ్జల భార్గవ, వైసీపీ సోషల్ మీడియా టీంపై సీఐడీ కేసులు !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు...

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో...

ఓటేస్తున్నారా ? : కోర్టు ధిక్కరణల పాలన గుర్తుకు తెచ్చుకోండి!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు ?. గతంలో ఒక్క కేసులో కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం రాజీనామా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close