వాహ్‌జీ… బ్ర‌హ్మాజీ..!!

కొంచెం అమాయ‌క‌త్వం
విప‌రీత‌మైన కోపం
ప‌ట్ట‌రాని సంతోషం
బీభ‌త్స‌మైన హ్యుమానిటీ
కొంచెం క‌న్నింగ్‌
భ‌యంక‌ర‌మైన బ‌లుపు

– దూకుడులో బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్లో షేడ్స్ ఇవి – స‌రిగ్గా ఇన్నో, ఇందులో కొన్నో – బ్ర‌హ్మాజీ ఖాతాలోనూ రాసేసుకోవొచ్చు.

ఎందుకంటే… అత‌ని పాత్ర‌ల్లోనూ ఇన్నేసి షేడ్లు క‌నిపిస్తుంటాయి. ఏ షేడ్ ఇచ్చినా – షేక్ చేసేస్తుంటాడు. బ్ర‌హ్మాజీ బ్ర‌హ్మానందంలా ప్ర‌ధాన కమెడియ‌న్ కాక‌పోవొచ్చు గానీ – దానికి ఏమాత్రం త‌గ్గ‌డు. సింగిల్ హ్యాండ్‌తో థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయించ‌లేడు గానీ – హీరో ప‌క్క‌నో, విల‌న్ ప‌క్క‌నో నిల‌బ‌డితే – న‌వ్వుల‌తో ప‌రుగెట్టించేస్తాడు. అందులో ఇన్నేళ్ల‌యినా బ్ర‌హ్మాజీ క్రేజ్ చెక్కు చెద‌ర‌లేదు. ద‌ర్శ‌కులు మారుతున్న కొద్దీ త‌న‌కు కొత్త త‌ర‌హా పాత్ర‌లు ప‌డుతున్నాయి… త‌నూ చెల‌రేగిపోతూనే ఉన్నాడు. ఈ వేస‌విలో ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు చిత్ర‌సీమ రెండు బ్లాక్ బస్ట‌ర్ హిట్లు చూసింది. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను రూపంలో. రెండింటిలోనూ బ్ర‌హ్మాజీ ఉన్నాడు. చేసిన‌వి చిన్న పాత్ర‌లే అయినా.. గుర్తుండిపోయే పాత్ర‌లు. రంగ‌స్థ‌లంలో బ్ర‌హ్మాజీకి ఎమోష‌న్ ట‌చ్ ఇస్తే.. భ‌ర‌త్‌లో కామెడీ టింజ్ క‌లిపారు. చెప్పాంగా.. ఎలాంటి పాత్ర‌లో అయినా దూసుకుపోతాడ‌ని. అలా రెండు సూప‌ర్ హిట్ల‌లో.. త‌నకంటూ ఓ భాగం ద‌క్కించుకోగ‌లిగాడు.

సింధూరంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బ్ర‌హ్మాజీ.. ఆ సినిమాలో బాగా న‌టించాడు. కాక‌పోతే.. ర‌వితేజ అల్ల‌రి ముందు అది క‌నిపించ‌కుండా పోయింది. మ‌ళ్లీ కృష్ణ‌వంశీనే చంద్ర‌లేఖ‌లో మ‌రో కీల‌క‌మైన పాత్ర ఇచ్చాడు. దాన్ని `జ్యూస్‌` పిండేసిన‌ట్టు పిండిపారేశాడు బ్ర‌హ్మాజీ. అయితే శివాజీ ఆత‌ర‌వాత హీరోగా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. ఆ త‌ర‌హా అవ‌కాశాలూ రాలేదు. హీరో ప‌క్క‌నో, విల‌న్ గ్యాంగ్‌లోనో ప్ర‌ధాన స‌భ్యుడిగా క‌నిపిస్తూ… త‌న వాటాగా న‌వ్విస్తూ, భ‌య‌పెడుతూ చ‌లామ‌ణీ అయిపోయాడు. `అత‌డు` బ్ర‌హ్మాజీకి మ‌రో ట‌ర్నింగ్ పాయింట్‌. అందులో కాస్త అమాయ‌క‌త్వం ఉన్న విల‌నిజం పండించాడు. `అన్ని బళ్లెందుకురా బుజ్జీ.. అస‌లే పెట్రోల్ రేటు పెరిగిపోయింది` అంటూ భ‌ర‌ణి కౌంట‌ర్ల‌కు బ‌లైపోయే బుజ్జిగాడులా.. భ‌లే న‌టించాడు. అప్ప‌టి నుంచి అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లు చాలా ప‌డుతూ వ‌చ్చాయి. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ముదురు పెళ్లికొడుకులా.. బ్ర‌హ్మాజీ న‌ట‌డ బాగా న‌వ్విస్తుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో సీరియ‌స్ రోల్స్ కూడా బాగా పోషిస్తూ వ‌చ్చాడు. కానీ ప్ర‌తి పాత్ర‌లో త‌న‌దైన టైమింగ్ పండిస్తూ – ఎక్క‌డా ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు. అందుకే… ఇన్నేళ్ల‌యినా… బ్ర‌హ్మాజీ హ‌వా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సీరియ‌ర్ కారెక్ట‌ర్ల అవ‌స‌రం చాలా ఉందిప్పుడు. బ్ర‌హ్మాజీ లాంటి వాళ్లు ఆ పాత్ర‌ని స‌మ‌ర్థంగా పోషిస్తున్నారు. ఇక ముందు కూడా బ్ర‌హ్మాజీ… మ‌రిన్ని మంచి పాత్ర‌లు పోషించాల‌ని, ఇలానే న‌వ్విస్తూ త‌న కెరీర్‌ని ముందుకు న‌డ‌పాల‌ని తెలుగు 360.కామ్ మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది. హ్యాపీ బ‌ర్త్ డే బ్ర‌హ్మాజీ గారూ..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close