లాంఛ‌నం పూర్తి.. కాంగ్రెస్ లో నాగం చేరిక‌..!

లాంఛ‌నం పూర్త‌యింది. తెలంగాణ భాజ‌పా నేత నాగం జనార్థ‌న్ రెడ్డి భాజ‌పాని వీడారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప‌లువురు నేత‌లు ఢిల్లీ వెళ్లారు. నాగంతో పాటు గ‌ద్ద‌ర్ కుమారుడు సూర్య‌కిర‌ణ్‌, వేముల‌వాడ‌కు చెందిన ఆది శ్రీ‌నివాస్ కూడా పార్టీలో చేరారు. నాగంకి కండువా క‌ప్పుతూ పార్టీలోకి రాహుల్ గాంధీ సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం ఉత్త‌మ్ మీడియాతో మాట్లాడుతూ… నాగం పార్టీలోకి రావ‌డం శుభ సూచ‌కం అన్నారు.

నాగం మాట్లాడుతూ… రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పార్టీ న‌ష్ట‌పోతోంద‌ని తెలిసినా కూడా నాడు సోనియా గాంధీ తెలంగాణ ప్ర‌క‌టించార‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డ్డార‌ని కొనియాడారు. కానీ, నేడు రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తీర‌లేద‌నీ, పేద‌రికం లేని తెలంగాణ‌కు ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎన్నో వాగ్దానాలు చేసి, అధికారంలోకి వ‌చ్చాక కేవ‌లం దోపిడీ ఒక్క‌టే ప్ర‌ధానంగా పెట్టుకుని పాలిస్తున్న తెరాస‌ను తుద‌ముట్టించ‌డం కోస‌మే తాను కాంగ్రెస్ లోకి చేరాను అన్నారు.

నిజానికి, భాజ‌పాలో ఉండ‌గా నాగం ఎదుర్కొన్న స‌మ‌స్య ఇదే. తెరాసపై పోరాటం చేస్తామంటే, అందుకు కావాల్సిన స్వేచ్ఛ‌ను పార్టీ త‌న‌కు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. ఆ వాద‌న‌తోనే నెమ్మ‌దిగా భాజ‌పాకి దూర‌మౌతూ వ‌చ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే, కాంగ్రెస్ లో ఆయ‌న‌కి స‌ముచిత స్థానం ఉంటుంద‌ని ఉత్త‌మ్ చెబుతున్నారు. స‌ముచితం అంటే… తెరాస‌పై పోరాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ, ఒక వ్య‌క్తిగా పోరాడే స్వేచ్ఛ కంటే… కాంగ్రెస్ పార్టీగా తెరాస‌పై పోరాటానికి మాత్ర‌మే అక్క‌డ ఉంటుంది..! నిజానికి, జాతీయ పార్టీల్లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అలానే ఉంటుంది. ప్ర‌తీ నిర్ణ‌యానికి అధిష్టానం ఆదేశాలూ అనుమ‌తులూ అవ‌స‌ర‌మౌతాయి. తెలుగుదేశంలో ఉండ‌గా ఆయ‌న‌కి అలాంటి ప‌రిస్థితి ఎదురుప‌డ‌లేదు. పైగా, టీడీపీలో ఉండ‌గా ఆయ‌న అత్యంత కీల‌క నేత‌ల్లో ఒక‌రు. అదే కీల‌క స్థానాన్ని ఆశిస్తూ.. భాజ‌పాలో చేరేస‌రికి వెన‌క వ‌రుస‌లో నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. మ‌రి, ఇప్పుడు టి. కాంగ్రెస్ లో ఆయ‌న ఏ వ‌రుస‌లో నిల‌బ‌డ‌తారో చూడాలి. ఏదేమైనా, పార్టీప‌రంగా కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌నే ప్ర‌చారానికి నాగం చేరిక‌ను ఉద‌హ‌రించుకునే అవ‌కాశమైతే ఉంది. ఇదే క్ర‌మంలో, తెలంగాణ‌లో భాజ‌పా వీక్ అవుతోంద‌ని విమ‌ర్శ‌కీ ఆస్కారముంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close