నయా రాజకీయ గురువులు..! పొలిటికల్ స్ట్రాటజిస్టులు..!!

విదేశాల్లో రాజకీయాలకు సంబంధం లేని చదువు చదివి.. ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య రంగంలో.. ఐక్యరాజ్యసమితి తరపున పని చేసి.. ఏపీలో ప్రజల్లో నుంచి వచ్చిన రాజకీయ నేతలకు..వ్యూహాలు నేర్పడమంటే… చిన్న విషయం కాదు. ఈ పని చేస్తోంది ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారునిగా జనం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు ఒకరు సలహాలిస్తే..పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ జగన్ …కొన్ని కోట్ల రూపాయలు ఫీజుగా ఇచ్చి పీకేని తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్ వేసే ప్రతి అడుగులో.. పీకే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్లీనరీలో తనను పీకేనే సీఎంను చేస్తాడని చెప్పుకుని జగన్.. తనకు రాజకీయం చేతకాదని నేరుగానే చెప్పేశారు. అంటే జగన్ రాజకీయానికి కర్త,కర్మ, క్రియ పీకే. ఇప్పుడు ఇదే తరహాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ్ అనే ఓ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ను అచ్చంగా జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసినట్లే పరిచయం చేశారు. ఆ దేవ్ కూడా ఇంగ్లిష్‌లో దంచికొట్టి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసేస్తానని ఉదరగొట్టారు. ఇక్కడా చెప్పుకోవాల్సిందేమిటంటే…పవన్ కు సొంతంగా రాజకీయ వ్యూహాలు పన్నుడం చేతకాక.. దేవ్ అనే వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నారని.
అయినా తెలుగు రాజకీయాల్లో ఈ తెలుగు రాని స్ట్రాటజిస్టుల గోలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏం రాజకీయాలు చేయాలో సూటు, బూటు వేసుకున్న పరాయి రాష్ట్రం వాళ్లు చెబితే.. మన నేతలు చేయడమేంటో.. ఎవరికీ అర్థం కావడం లేదు. సొంత రాజకీయ నిర్ణయాలు తీసుకోలేకపోతే.. ఇంకెందుకు రాజకీయాలు ‌అన్న భావన సాధారణ ప్రజల్లోనూ వస్తోంది. కాలేజీల్లో, యూనివర్శిటీల్లో చెప్పే పొలిటికల్ సైన్స్ కి … పుస్తకాల్లో ఉండే రాజకీయాలకు.. వాస్తవంగా ఉండే రాజకీయాలకు..నక్కకు..నాకలోకానికి ఉన్నతం తేడా ఉంటుంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే… ఉప్మా ఎలా చేయాలో పుస్తకంలో చెబుతారు.. కానీ ప్రాక్టికల్ గా ఉప్మా చేసేటప్పుడే ఆ కష్టం తెలుస్తోంది.

కులాలు, మతాలు, గతంలో ఎన్ని ఓట్లొచ్చాయి… ఈ సారి ఎన్ని వస్తాయి.. తేల్చేందుకు వీళ్లు ఓ టీమ్‌ను పెట్టుకుని..రకరకాల నివేదికలు తయారు చేస్తూంటారు. కానీ వీరికున్న అవగానహతో… అవన్నీ తమ బాస్‌ను మెప్పించేలా ఉంటాయి. పీకే.. నంద్యాల ఎన్నికల సమయంలో వైసీపీకి 20వేల మెజార్టీ వస్తుందని నివేదిక ఇచ్చారు. నిజమేననుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు వందల కోట్ల బెట్టింగులు కట్టారు. అటు సీటు పోయింది.. ఇటు డబ్బులూ పోయాయి. ఇలాంటి వాళ్లతో పెట్టుకుంటే అదే జరిగేది.

ఈ స్ట్రాటజిస్టులందరూ.. పుస్తకాల్లో చదివిన దానిని ప్రజల మీద ముఖ్యంగా తమను నమ్మిన లీడర్ల మీద రుద్దుతారు. భారీగా ఫీజులు వసూలు చేసుకుంటారు. కుదిరితే… ఇంకేమైనా ప్రయోజనాలుంటామో చూసుకుని..తమను తాము మార్కెట్ చేసుకుంటారు తప్పిదే.. ఏపీ ప్రజల భావోద్వేగాలు… వారి అవసరాలు.. వారి రాజకీయ ఆలోచనలు అర్థం చేసుకోలేదు. ఈ స్ట్రాటజిస్టుల వల్ల… వారిని పెట్టుకున్న వారికి రాజకీయం తెలియదనే ముద్రపడటం తప్ప…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close