ద‌టీజ్ రాజుగారు…!

చిత్ర‌సీమ‌లో కాంపౌండ్ల గోల లేనివాళ్లు, కాస్ట్ ఫీలింగ్ తో చూడాల్సిన ప‌నిలేనివాళ్లు, అంద‌రికీ కావాల్సిన‌వాళ్లు అతి త‌క్కువ మంది ఉంటారు. అలాంటివాళ్ల‌లో బి.ఏ రాజు ఒక‌రు. రాజుని టాలీవుడ్‌లో హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కేవ‌లం పీఆర్వోగా చూడ‌రు. ఇంట్లో మ‌నిషిలా భావిస్తారు. ఆయ‌నా త‌న‌ని తాను పీఆర్వో అనుకోరు. ఆ సినిమాకి ప‌నిచేస్తున్న వాళ్ల‌లో తాను ఒక‌డిగా మారిపోతారు. నిర్మాత క‌ష్ట‌సుఖాల్లో, ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల్లో, ఆఖ‌రికి ఆ హీరో ఇమేజీలో తానూ వాటా అందుకుంటారు. అందుకే అంద‌రికీ ఆయ‌నేకావాలి.. అంద‌రితోనూ ఆయ‌న ఉండాలి. కాబ‌ట్టే ద‌శాబ్దాలుగా ఈ రంగంలో ఉండ‌గ‌లుగుతున్నారు. వంద‌లాది చిత్రాల ప్ర‌చార బాధ్య‌త‌ని త‌న‌పై వేసుకుని.. ఇప్ప‌టికీ స్టార్ పీఆర్వోగా కొన‌సాగుతున్నారు. `ఈ సినిమాకి నేను పీఆర్వో కాదు క‌దా` అని ఏ సినిమానీ త‌క్కువ చేయ‌రు, ఎవ‌రి గురించీ త‌క్కువ‌గా మాట్లాడ‌రు. అది వ్య‌క్తుల‌పై గౌర‌వంతో కాదు. అన్నంపెడుతున్న ప‌రిశ్ర‌మ‌పై త‌న‌కున్న ప్రేమ‌తో! అదే రాజులోని స్పెషాలిటీ. కాబ‌ట్టే ఇప్ప‌టికీ.. ఆయ‌న అంద‌రివాడుగానే చ‌లామ‌ణీ అవుతున్నారు.

బీఏ రాజుని కేవ‌లం పీఆర్వోగానే చూడ‌లేం. ఆయ‌న ప్ర‌యాణం జ‌ర్న‌లిస్టుగా మొద‌లైంది. `సూప‌ర్ హిట్‌` అనే ప‌త్రిక స్థాపించి.. తానే ఓ సైనికుడిగా, శ్రామికుడిగా చ‌మ‌టోడ్చి… ఆ పత్రిక‌ను శిఖ‌రాగ్రాన నిల‌బెట్టారు. నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి.. అందులోనూ విజేత‌గా నిలిచారు. ల‌వ్ లీ లాంటి సూస‌ర్ హిట్ సినిమాల్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ద‌శాబ్దాలుగా బిఏ రాజు చేస్తున్న సేవ‌ని ఇప్పుడు ఫాస్ సంస్థ‌ దాస‌రి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో బీఏ రాజుని స‌త్క‌రించ‌బోతోంది. ఈనెల 6న హైద‌రాబాద్ త్యాగ‌రాయ గాన‌స‌భ‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో రాజు అవార్డు అందుకున్నారు. ”దాస‌రి గారి బెస్ట్ జ‌ర్న‌లిస్ట్ అవార్డు అందుకోవ‌డం సంతోషం క‌లిగించింది. ఇప్పుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ద‌క్కినందుకు ఆనందంగా ఉంది. సాటి అవార్డు గ్ర‌హీత‌ల‌కు అభినంద‌న‌లు” అంటూ బీఏ రాజు త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. పీఆర్వోగా స్టార్‌డ‌మ్ చూసిన రాజు.. మ‌రిన్ని శిఖ‌రాలు అధిరోహించాల‌ని తెలుగు 360 మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది. ఆల్ ద బెస్ట్ రాజు గారూ…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close