పెళ్లి ‘సాక్ష్యం’గా పాట…

ఇప్పటివరకూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసినవన్నీ మాస్ కమర్షియల్ సినిమాలే. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎలాగున్నా.. సినిమాలో సాంగులను మాత్రం ఓ రేంజ్‌లో వుండేలా చూసుకుంటున్నాడీ యంగ్ హీరో. ప్రతి సినిమాలో పక్కా ఐటమ్ సాంగ్ పెడతాడు. కాని ప్రజెంట్ సెట్స్ మీదున్న ‘సాక్ష్యం’లో మాత్రం ఐటమ్ సాంగ్ లేదట. ఎందుకంటే… కథలో అటువంటి పాటకు చోటు లేదంటున్నారు. ఐటమ్ సాంగులు తీసేస్తే బెల్లంకొండ సినిమాల్లో మామూలు సాంగులు సైతం చాలా రిచ్‌గా వుంటాయి. కుదిరితే ఫారిన్ కంట్రీల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ లేదంటే ఇక్కడే హైదరాబాద్‌లో స్పెషల్ సెట్టింగులు వేయిస్తాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకంజ వేయడు. ఇప్పుడీ ‘సాక్ష్యం’ కోసం హైదరాబాద్‌లో ఒక పాటను తీస్తున్నారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాటకు భారీగా ఖర్చు చేస్తున్నార్ట‌. మూడ్రోజుల నుంచి స్పెషల్‌గా వేసిన సెట్‌లో తీస్తున్నారు. ఇక, ఐటమ్ సాంగ్ లేదని ప్రేక్షకులు దిగాలు పడాల్సిన పని లేదు. ఏదొక పాటలో హీరోయిన్ పూజ హెగ్డే అందాల విందు అందిస్తానని ప్రామిస్ చేశార్ట‌. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’లో ఈ బ్యూటీ వేసిన బికినీని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోగలరా చెప్పండి? ఇక, సినిమా విషయానికి వస్తే… ఇప్పటివరకూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా టీజర్ డిఫరెంట్‌గా వుంది. సినిమా ఎలాగుంటుందో? ఖర్చుకు వెనుకాడకుండా తీస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close