అల్లు అర్జున్ హీరోయిన్‌కి మళ్లీ నిరాశే!

అల్లు అర్జున్ పక్కన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించిన హీరోయిన్ అనూ ఎమ్మాన్యుయేల్. పేరుకి స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నాయి గానీ సక్సెస్‌లు రావడం లేదు. పోనీ అమ్మాయి నటనకు పేరు వస్తుందా? అంటే.. అదీ లేదు. అందం ఎంత వున్నప్పటికీ అదృష్టం ఆవగింజ అంత కూడా వున్నట్టు లేదు. దాంతో స్టార్ హీరోయిన్ రేసులోకి వెళ్లాలనుకున్నా అమ్మాయి ఆశలు త్వరగా తీరేలా కనిపించడం లేదు. తెలుగులో అనూ ఎమ్మాన్యుయేల్ సంతకం చేసిన తొలి సినిమా ‘ఆక్సిజన్’. దానికంటే ముందు ‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ విడుదలయ్యాయి. రెండూ అనూకి మంచి పేరు తెచ్చాయి. తరవాత వచ్చిన ‘ఆక్సిజన్’ హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ ఫ్లాప్ ఆమెపై ఎఫెక్ట్ చూపించలేదు. ఆ తరవాత చేసిన ‘అజ్ఞాతవాసి’పై అనూ ఎమ్మాన్యుయేల్ పెద్ద ఆశలు పెట్టుకుంది. అది ఫ్లాప్ కావడంతో అమ్మాయి ఆశలకు గండి పడింది. నిరాశే ఎదురైంది. అది పోతే తరవాత అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లైనులో వుందనుకుంటే… నిన్న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అంతకు మించి అనూ పాత్రకు ప్రాముఖ్యత లేదని విమర్శకులతో పాటు ప్రేక్షకులూ తేల్చేశారు. దీంతో మరోసారి నిరాశ ఎదురైంది. నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలపైనే అనూ ఆశలన్నీ. అవి హిట్టయితే కెరీర్ కంటిన్యూ అవుతుంది. లేదంటే అంతే సంగతులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close