కళ్లు మూతలు పడుతున్నా కథ విన్నా: తమన్నా

“సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమంది అమ్మాయిలను తమ కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారని అడిగితే… జయేంద్ర సర్ దగ్గరకు వెళ్లాము. కానీ, ఛాన్స్ దొరకలేదని అంటారు. ఆయన ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నారు. ఆయనతో ఎంతోమంది పని చేయాలని అనుకుంటారు. నాకు ఆ అవకాశం వచ్చింది. ఐ జస్ట్ ఫీల్ లక్కీ” అన్నారు తమన్నా. జయేంద్ర దర్శకత్వంలో నందమూరి క‌ల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘నా నువ్వే’. అంత ఇష్టమైన దర్శకుడు కథ చెప్పడానికి వచ్చిన సమయంలో తమన్నా కళ్లు మూతలు పడ్డాయట. నిద్ర ముంచుకు వచ్చేసిందని చెప్పారామె. ఆ సందర్భం గురించి ఆమె మాట్లాడుతూ “జయేంద్రగారు తొలిసారి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను అమెరికా నుంచి అప్పుడే ఇండియా వచ్చాను. ఇరవై రెండు గంటలు ఫ్లైట్ జర్నీ చేశా. ఆయన కథ చెబుతుంటే నాకు నిద్ర వచ్చేస్తుంటుంది. కొన్ని సన్నివేశాల్లో నిద్ర వచ్చేసేది కూడా. కానీ, కథ వినేదాన్ని. ‘వావ్… భలే వుంది’ అనుకునేదాన్ని. అయితే పరిస్థితుల వల్ల కళ్లు మూతలు పడేవి” అని చెప్పారు. సినిమా బేసిక్ కథ నచ్చిందనీ, అదేంటో ఆడియో వేడుకలో చెప్పలేననీ తమన్నా పేర్కొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పేరు మార్చుకుంటారా..?పోస్ట్ వైరల్..!!

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ ఇక పేరు మార్చుకునేందుకు రెడీ అవ్వాలంటూ జన సైనికులు రూపొందించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది....

వైసీపీ సోషల్ మీడియా దుకాణ్ బంద్ !

పోలింగ్ సరళితోనే వైసీపీ దుకాణ్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రిషిరాజ్ సింగ్ నేతృతవంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక...

విషాదం… పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే...

డైవర్ట్ ఓటు…కాంగ్రెస్ కు శాపంగా మారనుందా..?

ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close