యాత్ర‌కు బ‌స్సు రెడీ… ప‌వ‌న్ రెడీ అయ్యారా..?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లో జ‌నంలోకి వెళ్ల‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సు యాత్రకు ఆయ‌న బ‌య‌లుదేర‌బోతున్నారు. దీని కోసం జ‌న‌సేన ప్ర‌త్యేకంగా ఒక బ‌స్సును కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం దాని రీ మోడ‌లింగ్ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. అత్యాధునిక స‌దుపాయాలు ఈ బ‌స్సులో ఉండ‌బోతున్నాయి. బ‌స్సులో అత్య‌వ‌స‌ర స‌మావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఒక రూమ్ ఏర్పాటు ఉంటుంద‌ని అంటున్నారు. ఒక విశ్రాంతి గ‌ది, ల్యాప్ టాప్ సౌక‌ర్యం, బ‌స్సులోంచి టాప్ మీదకు వెళ్లి ప్ర‌సంగించేందుకు అనువుగా నిచ్చెన వంటి సౌక‌ర్యాలు కూడా ఉంటాయ‌ట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటుంబ స‌భ్యుల‌తో విదేశీ టూర్ లో ఉన్నార‌ని స‌మాచారం.

యాత్ర‌కు బ‌స్సు సిద్ధ‌మౌతోంది, బాగానే ఉంది! కానీ, ఈ యాత్ర‌కు ప‌వ‌న్ ఎలా సిద్ధ‌మౌతున్నారు అనేదే అస‌లు పాయింట్‌. ఎందుకంటే, గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌లు నిర్వ‌హించిన స‌భ‌లూ ప‌ర్య‌ట‌న‌లు ఒక లెక్క‌, ఇప్పుడు ఇంకో లెక్క‌. గ‌త కార్య‌క్ర‌మాల‌న్నీ కేవ‌లం స‌మ‌స్య‌ల అజెండా మీదే జ‌రిగాయి. కానీ, ఇప్పుడు జ‌న‌సేన రాజ‌కీయ అజెండాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌బోతున్నారు. 175 స్థానాల్లో పోటీకి జ‌న‌సేన సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించేశారు. కాబ‌ట్టి, జ‌న‌సేన విధివిధానాలేంట‌నేది ఈ బ‌స్సుయాత్ర ద్వారా ప్ర‌జ‌లకు వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలపై ఈ మధ్య చాలా విమ‌ర్శ‌లు చేశారు. మరీ ముఖ్యంగా అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. వాటికి కొన‌సాగింపుగా బ‌స్సుయాత్ర‌లో ప‌వ‌న్ మాట్లాడాల్సి ఉంటుంది క‌దా! ప‌వ‌న్ చేసే ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలుండ‌వ‌నే అభిప్రాయం ఇప్ప‌టికే ఉంది. కాబ‌ట్టి, బ‌స్సుయాత్ర‌లో ప్ర‌భుత్వాల‌పై చేసే ఆరోప‌ణ‌ల‌కు ఏవైనా ఆధారాలు చూపే ప్ర‌య‌త్నం చేస్తారేమో చూడాలి.

ఇక‌, ఈ యాత్ర‌లో ప‌వ‌న్ ఎదుర్కోబోతున్న స‌వాల్ కూడా ఒక‌టుంది. ఇటీవ‌ల ఆయ‌న మీడియాలోని ఒక వ‌ర్గంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కొంత‌మంది ప‌త్రికాధిప‌తులు ల‌క్ష్యంగా చేసుకుని, అదే ప‌నిగా కొన్ని రోజుల‌పాటు ట్వీట్లు పెడుతూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ట్వీట్ల‌కు, ప‌వ‌న్ కి సంబంధించిన వార్తా క‌థ‌నాల‌కు ప్ర‌ధాన మీడియా వ‌ర్గాలు ప్రాధాన్య‌త త‌గ్గించాయ‌నే చెప్పాలి. దీంతో బ‌స్సుయాత్ర నేప‌థ్యంలో మీడియా వ్య‌వ‌హార శైలి ఎలా ఉండ‌బోతోంద‌నేది కూడా ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయమే అవుతుంది. సో.. ఈ యాత్ర‌కు బ‌య‌లుదేరేముందు పవన్ చాలా క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రం కనిపిస్తోంది. మ‌రి, రాజ‌కీయంగా ఏపీలో అత్యంత కీల‌కం కాబోతుంద‌న్న అంచ‌నాలున్న బ‌స్సు యాత్ర‌కు ప‌వ‌న్ ఎలా రెడీ అయి వెళ్లబోతున్నారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close