బిగ్ బాసూ… నాని తెలివైనోడే కదూ!

ఓ భాషలో హిట్టయిన సినిమాను, ప్రేక్షకులు అందరూ చూసేసిన సినిమాను… మళ్లీ అదే భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టడం ఎంత కష్టమో?? ఒకరు హోస్ట్ చేసిన షోను హోస్ట్ చేసి.. బుల్లితెర వీక్షకులను ఆకట్టుకోవడం కూడా అంతే కష్టం. క్లాసిక్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు కథ తప్ప టేకింగ్, మేకింగ్ కొత్తగా వుంటాయనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించాలి. అప్పుడే థియేటర్లకు వస్తారు. షో విషయంలోనూ అదే ఫార్ములా పాటించాలి. కాన్సెప్ట్ అదే అయినా… కొత్తగా వచ్చే హోస్ట్ నేను కొత్తగా చేస్తాననే ఫీల్ కలిగించాలి. అప్పుడే గేమ్ ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో నాని సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. ‘బిగ్ బాస్-2’ని నాని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే ఎన్టీఆరే అనేట్టు షోని ఇంట్రెస్టింగ్ గా చేశాడు. అతడి ప్లేసులోకి నాని వచ్చాడు. సో, నాని ముందుగా చేయవలసిన పని… ఎన్టీఆర్ ఛాయలు అతడిపై పడకుండా చూసుకోవడం. ‘బిగ్ బాస్-2’ ఫస్ట్ లుక్ లో నాని ఆ పని మొదలు పెట్టాడు.

ఒక్కసారి ఓ ఏడాది వెనక్కి వెళ్లి… ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ ఫస్ట్ లుక్ గుర్తుకు తెచ్చుకోండి. సూటు… బూటు… మంచి స్టయిలుగా ఖరీదైన రాయల్ సోఫా కుర్చీలో కూర్చుంటాడు. ‘తెలుగింటి మనవడు’ అని ప్రోమోలు కట్ చేసినా… అవన్నీ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు నాని ‘బిగ్ బాస్-2’ లుక్ చూడండి! స్టూల్ మీద టీ కప్పు… కప్పు ముందుకు కొంచెం బెండ్ అయిన నాని… తనకున్న నేచురల్ స్టార్ బిరుదుకు తగ్గట్టు నేచురల్ ఎంట్రీ ఇచ్చాడు. ‘బాబాయ్.. ఈసారి కొంచెం మసాలా ఎక్కువ’ కాప్షన్ తో నేటివ్ మాస్ టచ్ ఇచ్చి కిక్ ఎక్కించాడు. బహుశా… నెక్స్ట్ పబ్లిసిటీ కూడా ఇదే విధంగా ప్లాన్ చేసి వుంటాడు. షో విషయంలో ఎన్టీఆర్ క్లాస్ అయితే… నాని మాస్! ప్రేక్షకులకు ఈ విషయం అర్థమయ్యేట్టు చేయడంలో నాని వేసిన తొలి అడుగు విజయవంతం అయ్యింది. మలి అడుగులు, షో ఎలా హోస్ట్ చేస్తాడనే విషయాలు చూడాలి. ఇవన్నీ చూస్తుంటే ‘బిగ్ బాసూ… నాని తెలివైనోడే కదూ’ అనాలని వుంది కదా!!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close