దారిలోకొచ్చిన సాయి ప‌ల్ల‌వి

సాధార‌ణంగా సెట్లో హీరోల డామినేష‌నే క‌నిపిస్తుంటుంది. మ‌హా అయితే.. స్టార్ డైరెక్ట‌ర్లు త‌మ హ‌వా చూపిస్తుంటారు. క‌థానాయిక డామినేష‌న్ అనేది చాలా తక్కువ‌. కానీ.. కేర‌ళ కుట్టీలు మాత్రం సెట్లో చాలా కమాండింగ్‌గా ఉంటుంటార‌ట‌. సాయి ప‌ల్ల‌వి అందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. తెలుగులో సాయి ప‌ల్ల‌వి చేసింది త‌క్కువ సినిమాలే. కాక‌పోతే.. హీరోల‌పై డామినేష‌న్ ఎక్కువ చేస్తుంద‌ని, ”నా పాత్ర ప‌రిధి ఎక్కువ ఉండాలి” అని ష‌ర‌తులు పెడుతుంద‌ని, సెట్లో చుక్క‌లు చూపిస్తుంటుంద‌ని.. ర‌క‌ర‌కాల రూమ‌ర్లు. ‘క‌ణం’ స‌మ‌యంలో నాగ శౌర్య కూడా సాయి ప‌ల్ల‌విపై భ‌యంక‌ర‌మైన కామెంట్లు చేశాడు. సెట్లో త‌న ఆధిప‌త్య‌మే ఎక్కువ ఉంటుంద‌ని మీడియా ముఖంగా విమ‌ర్శించాడు. దాంతో సాయి ప‌ల్ల‌విపై వ‌చ్చిన‌వి రూమ‌ర్లు కావ‌ని, నిజాలే అని అర్థ‌మ‌య్యాయి.

అయితే ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి పూర్తిగా మారిపోయింద‌ట‌. త‌న ప‌నేదో తాను చూసుకుని సైలెంట్‌గా వెళ్లిపోతోంద‌ట‌. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌తో `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`లో న‌టిస్తోంది సాయి ప‌ల్ల‌వి. సెట్లో త‌న ప్ర‌వ‌ర్త‌న పూర్తిగా మారింద‌ని, డామినేష‌న్ అనే మాటే క‌నిపించ‌డం లేదని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ”మేం కూడా సాయి ప‌ల్ల‌వి డామినేట్ చేస్తుంద‌న్న మాట‌లు విన్నాం. కానీ.. మా సెట్లో అలా జ‌ర‌గ‌డం లేదు. త‌ను చాలా కూల్‌..” అని యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. మొత్తానికి ‘క‌ణం’ ఎఫెక్ట్‌, శ‌ర్వా స్టేట్‌మెంట్లు సాయి ప‌ల్ల‌విపై బాగానే ప్ర‌భావం చూపించాయ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close